ఫుజియామా పర్వతాన్ని జపాన్ కు చిహ్నంగా చెప్పవచ్చు. దీని ఛాయాచిత్రం బ్యాంకు నోట్ల మీద, స్టాంపుల మీద పెయింటింగ్స్ మీద, చిత్రాల మీద కనిపిస్తూ ఉంటుంది. షింటో దేవతల నివాస స్థానంగా భావించే ఈ పర్వతం జపాన్ దేశస్థులకు ఎంతో పవిత్రమైనది. పాన్ భాషలోఫుజీసాన్ గా పిలువబడే పుజియమా పర్వతం ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతాలలో ఒకటి. జపాన్లోని అన్ని పర్వతాల కంటే ఇది చాలా ఎత్తయిన క్రీస్తు శకం 781 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు బద్దలవటం జరిగింది. చివరిసారిగా ఇది ఈడో యుగంలో 300 సంవత్సరాల క్రితం బ్రదలైంది. నవంబర్ 24, 1707 నుండి జనవరి 22, 1708 వరకు ఇది నిప్పుతో కూడిన లావాను వెదజల్లుతూనే ఉన్నది. 60 మైళ్ళ దూరంలో ఉన్న టోక్యో నగరంలోని చాలా భాగం లావా బూడిదతో కప్పబడి పోయింది.
ఒక అజ్ఞాత సాధువు 663 వ సంవత్సరంలో ఈ పర్వతాన్ని మొదటిసారిగా అధిరోహించాడు. దాదాపుగా రెండు లక్షల మంది శిఖరం మీదకు ఎక్కి 750 అడుగుల లోతున అగ్నిబిలం చూస్తూ ఉంటారు.
దీని ఎత్తు 12,383 అడుగులు. టోక్యో నగరానికి పశ్చిమంగా 60 మైళ్ళ దూరంలో హోనోషు ద్వీపంలో ఉన్నది.
పుజియమా ఒక లక్ష సంవత్సరాల క్రితం ఏర్పడింది. పాన్ చిత్రకళలో దీని చిత్రాలు అభిమాన విషయాలు. జపాన్లో ఇంకే ఇతర ప్రకృతి రూపాలను కూడా దీని అంతగా ఛాయాచిత్రాలుగా తీయబడటం కానీ, అద్దకం చేయడం కానీ పెయింటింగ్ చేయడం కానీ చిత్రీకరించబడటం కానీ జరగలేదు.
ఫుజియామా (జపాన్);- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి