.వంచన;- పద్మావతి పి-హైదరాబాద్
నానీలు
----------
1.
నడివీధుల్లో పాములు
తిరుగుతున్నాయి
కాటేస్తున్నాయి
వంచనలతో..
2.
అరచేతిలో స్వర్గం
విజ్ఞానంతో
పరుగులు తీస్తుంది
అజ్ఞానం..
3.
చెట్టు మీద జెండా
పక్షులు లేకుండా
పార్టీ ఎజెండా
పని లేకుండా..
4.
పూజిస్తున్నాం
చెట్టు పుట్ట రాయి రప్ప
కాల్చేస్తున్నాం
కాలుష్యాగ్నితో..
5.
నయవంచన
పట్టనితనం
పరిపాలన
మౌఢ్యం జాడ్యంతో..
6.
శ్రమజీవి
చెమట బొట్టు
ఆయువుపట్టు
అవని సౌభాగ్యానికి..
*******


కామెంట్‌లు