ఎదిగే గులాబీకి మల్లెతీగతో పని ఏంటి!?
పూస్తే గులాబీలే పూయాలంటుంది.
పుడితే గులాబీ గానే పుట్టాలి అంటుంది అంతే!!.?
పెరిగే మరుమల్లే పందిరికి గులాబీ తో పనేంటి.!!!?
పుడితే మల్లె గానే పుట్టాలని
పూస్తే మల్లెపూవుగానే పూయాలని అంటుంది అంతే!!?
అట్లా ఉంటుంది నీతి నిజాయితీ జాతిది!!!
*** *** ****
ఒక ఇంజనీరు ఒక డాక్టరు ఒక శాస్త్రవేత్త
ఒకటవ తరగతి పిల్లవానికి ఏం చెప్తాడు!!?
నీవు ఒక ఇంజనీరు ఒక డాక్టరువు ఒక శాస్త్రవేత్తవు అని కాదు
అవుతావు అని చెప్తాడు..!!!
అది నిజం కూడా సరిగ్గా అలాగే
దేవుడు కూడా మనకు
ఒక ఇంజనీరు లాగా ఒక డాక్టర్ లాగా ఒక శాస్త్రవేత్తలాగా అలా చెప్పాలి అప్పుడే
మనం మనుషుల మని తెలుసుకుంటాం!!!
**** *** ****
మన మానసిక రుగ్మతలకు
అందము శృంగారం కూడా
ఒక మందు లాంటిది!!!!!!!!!?
సరళరేఖల్లో బిందువుల్లాగా
సరళ జీవనానికి
ఒక ఆత్మబంధువు లాంటిది
అందము శృంగారం!!!!!!!!!!!?
**** . *** . ****
ప్రాణాపాయంలో
ప్రేమలో
ఆకలి దప్పికలో
అర్హత కోసం ఆలోచిస్తామా
ఆలోచిస్తే చస్తాం!!!!!!!!!!!?
***** *** . ***
జేమ్స్ డైమండ్స్ పగలవు
నీవు నిలబడి పగలబడి నవ్విన
అవి పగలవు
చరిత్రలో మిగిలే ఉంటాయి!!!!!!.
కొన్నిసార్లు కోపం ఎట్లా ఉంటుందంటే
విషం కోసం పాపం పాములను చంపినట్లు ఉంటుంది.
అంతకన్నా విషం ఇంకేం ఉంటుంది!!!?
మణి -మనీ విషం లాంటిది
అది పాముల దగ్గరే ఉంటుంది!!!?
+++++++++ ++++++ . ++++++
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి