అనగనగ రంగంపల్లి అనే ఊర్లో జంగ్లయ్య అనే ఒక రైతు ఉండేవాడు ఆయనకు ఎప్పుడు పొలం,బావి తప్ప వేరేది ఎం తెలియదు.ఆయన పొలంలో విత్తనాలు చల్లడానికి సమయం వచ్చింది.అప్పుడు మందుల దుకాణం దగ్గరకు వెళ్ళి విత్తనాలు తెస్తాడు.తెచ్చి వాటిని ముంచడం,తీయడం చేస్తాడు.చేశాక అల నాలుగు రోజుల తరువాత విత్తనాలకు మొలకలోస్తాయి.వాటిని తీసుకువెళ్ళి పొలంలో చల్లుతాడు.చల్లిన తరువాత పొలానికి రెండు మూడు వారాలు పొలానికి కాపల ఉంటాడు.ఆ తరువాత నారు తయారవుతుంది అప్పుడు కొందర్ని పనివాళ్లని పిలిచి నాటు వేయిస్తాడు. జంగ్లయ్య పిలవ గానే ఆ పనివాళ్ళు ఎంత పని ఉన్న వచ్చేస్తారు.ఎందుకంటే ఆ రైతు ఎంతో మంచివాడు అందుకే పనివాళ్ళు అతను పిలవగానే వస్తారు.ఇక పొలంలో నాటు వేసి పనివాళ్ళు వెళ్ళిపోతారు.ఇక నాటు వేసిన కొన్ని రోజుల తరువాత పొలానికి మందు చాల్లుతాడు.ఆ తర్వాత మూడు నెళ్ళ తరువాత పంట చేతికొస్తుంది అనగా ఒకే సారి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఇక చిన్న చిన్న చినుకులు పడుతాయి.అప్పుడు ఆ రైతుకు భయమేస్తుంది అప్పుడే ఇలా అంటాడు.అరే ఇదెక్కడి శెనిరో పంట చేతికొస్తున్నది అనుకుంటే చినుకులు పడుతున్నాయి అని అనుకుంటాడు.వెంటనే దేవుడికి ముక్కుతాడు. అప్పుడే వర్షం తగ్గినట్టే తగ్గి ఇంక ఎక్కువగ పడుతుంది. ఆ వర్షం తో పాటు పెద్ద పెద్ద గాలులు కూడ వస్తాయి.ఆ తరువాత ఏం చేయాలో అర్థం కాక భయంతో ఒక దగ్గర కూర్చోని ఆలోచనలో పడుతాడు. ఆలోచిస్తుండగా వర్షం తగ్గిపోతుంది అప్పుడు రైతు ఆ పొలాన్ని చూడాలనే ఆత్రుతతో ఉరికి కింద పడుతాడు అప్పుడు దెబ్బతగులుతుంది. దెబ్బ తగిలింది కూడ లెక్కచేయకుండా పొలాన్ని చూడడానికి వెళ్తాడు. అప్పుడు పొలాన్ని చూసి ఆనందిస్తాడు ఎందుకంటే ఆ పొలానికి ఏం కాలేదు కాబట్టి. అప్పుడు రైతు ఇలా అనుకుంటాడు అరే నేను దేవుడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చేశాడు అని అనుకుంటు దేవుడికి కృతజ్ఞతలు చెప్పి ఇక వెంబటే పొలాన్ని కోయిస్తాడు. ఇక ఏ భయం లేకుండా బ్రతకగలడు. ఎందుకంటే ఆ రైతుకు దేవుడు మీద నమ్మకం, పొలం మీద ప్రేమ, పొలం చేతికొస్తుందనే ఆశ, రైతుకు ఉన్న మంచితనం. ఇవి ఉన్నాయి కాబట్టే రైతు అనుకున్నవి జరిగాయి.
నీతి: మనకి కూడా ఆ రైతులాగే నమ్మకం, ప్రేమ, ఆశ, మంచితనం ఉంటే మనం కూడా ఏదైనా సాధించగలము
నీతి: మనకి కూడా ఆ రైతులాగే నమ్మకం, ప్రేమ, ఆశ, మంచితనం ఉంటే మనం కూడా ఏదైనా సాధించగలము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి