ఊరుదాటి... ఏరుదాటి....ఎక్కడో ఉన్న పాఠాశాలకుఅనేక కష్ట -,నష్టాలను భరిస్తూబిడ్డలను బాగా చదివించి ప్రయోజకుల్ని చెయ్యాలనే తపన !బిడ్డనుభుజాలకెక్కించుకుని...మోకాళ్లలోతు నీళ్లలో...బడికి చేరుస్తున్న... ఆ తల్లివిసుగుపడదు !ఆ పనిలో ఆమెకు... యిబ్బంది అనిపించదు !!ఆనందమే తప్ప, బాధనియే నాడూ అనుకోదు !ఈ రోజు పిల్లల్ని బాగాచూసుకుంటే.... రేపు వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు, అనుకునే.లాభ, నష్టాల యివ్వాపార ధోరణి కాదామెది !!ఆమె మనసునిండా మమకారం...పిల్లలు ప్రయోజకులు కావాలనే ప్రేమతో...నిష్కామ కర్మయోగిలా సేవలు చేసే త్యాగమయి ఆమెఒరేయ్... చిన్నా..... !నువ్ పెరిగి ప్రయోజకుని వైనరోజు...,నీ సుఖము, ఆనందాలకు ఆ ముసలి తల్లిఅడ్డయి పోయిందని తలచి....నువ్వు బ్రతికుండగానే ఆమెను అనాథను చేసి..., యే ఆశ్రమంలోనే పడేసి, చేతులుదులుపుకోకురా కన్నానీకు జన్మ నిచ్చి.... కంటికి రెప్పలా కాచుకుంటూ... నీకోసమే బ్రతికిన తల్లిదండ్రులకు... నీ బిడ్డల తో పాటే ఒకబిడ్డగా తలచి ప్రేమగా చూసుకో చాలు... !ఆ హృదయాలు ఎంతో ఆనందంతో పొంగిపోతూ....నువ్ చల్లగా ఉండాలనే ఒక్క దీవెన, నీకు కోటి దేవుళ్ళ బలమై కాస్తుంది !!మరచి పోవద్దు...,తల్లిదండ్రులు మనకు, చిన్నప్పుడు చేసిన సేవలను చూపించిన ప్రేమాభిమానములనూ... మరచిపోకుండా, గుర్తు చేసు కుంటూ ఉండు... !వారు నీపై చూపించిన దానిలో కనీసం సగమైనా నువ్వూ చూపించు !!అప్పుడే నువ్వూ మనిషి వినిపించుకుంటావ్, !*******
అమ్మ మనసు ; - కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి