ముని అంటే మననం చింతన చేసేవాడు అని అర్థం.మనుతే జానతి యః ఇతి మన్ ఇన్.నిర్విశేషంవిషేన్మునిః. ఈశ్వరుని సుగుణ భక్తి మార్గం నిదాటి నిర్గుణ భక్తి లో ప్రవేశించే వాడే ముని.దుఃఖంలోగూడా ఉద్వేగభరితంగా ఉండి సుఖం పొందినా స్పృహ లేకుండా ఉండేవాడు రాగభయక్రోధాలు లేనివాడు స్థిరబుద్ధి కలవాడు ముని.
గరుడపురాణం ప్రకారం అన్ని రకాల సాంసారిక వాసనలు వదిలి భగవంతుని లో చిత్తం నిలుపుతాడు.తర్పణం హోమం సంధ్యావందనం లాంటి క్రియలు ద్వారా భగవంతుని చేరుతాడు.దేవుడు తప్పు అతనికెవ్వరూ లేరు.బ్రహ్మచర్యం పాటిస్తారు.
ఋగ్వేదంలో ముని శబ్దం రెండు సార్లు వస్తుంది.ఈశ్వరప్రేరిత అద్భుతవ్యక్తి. బూడిద రంగు మలినవస్త్ర ధారిగా పేర్కొన్నారు.సాయణుని అనుసారం వాతజూతి విప్రజూతిఋషులుగా పేర్కొన్నారు .వల్కలాలు ధరించారు.ఇంద్రుని మునిసఖాఅన్నారు.నిగ్రహీ అని అన్నారు.ముని బ్రహ్మానందం లో నిమగ్నమై ఉంటాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి