పల్లవి::
ముత్యాల ముగ్గులన్ని
ముంగిట్లో మెరిసాయి
వర్ణాల పువ్వులన్ని
నీకోసం విరిసాయి
రావమ్మా !వరలక్ష్మి
పిలిచింది గృహలక్ష్మి.
"ముత్యాల"
చరణం::
పసిడిలాంటి పసుపునద్ది
కుంకుమనే
తీర్చిదిద్ది
ఇంటింటి గడపలన్ని
శోభితమయి నిలిచాయి.
పచ్చదనపు కాంతులతో
తోరణాలు వెలిసాయి
కుసుమాల మాలికల
పరిమళములు
వీచాయి
రావమ్మా! వరలక్ష్మి
పిలిచింది గృహలక్ష్మి.
"ముత్యాల"
చరణం::
కొలనులోని తామరలా
వికసించెను నీ వదనం
ఎర్రన్ని సూర్యునిలా
కనిపించెను నీ తిలకం
అందమైన వెన్నెలగా
చలువ పంచె
నీ హాసం
మధురమైన రవళిగా
వినిపించే నీ గానం.
రావమ్మా! వరలక్ష్మి
పిలిచింది గృహలక్ష్మి.
"ముత్యాల"
చరణం::
గలగలమను గాజులతో
ఘల్లుమనెడి అందెలతో
చిరునగవుల దొంతరతో
చల్లనైన దీవెనతో
వెల్లువంటి కరుణతో
మల్లియంటి మనసుతో
కనకంబు రాశులతో
కామితములిడు వరములతో
రావమ్మా! వరలక్ష్మి
పిలిచింది గృహలక్ష్మి.
"ముత్యాల"
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి