పోటీ!(స్వీయకవిత) అచ్యుతుని రాజ్యశ్రీ
గాలి తలుపుకి మధ్య పోటీ
తోపులాట లో  లేరెవరూ సాటి
మౌనంగా వినే గోడలు
ఎండలో కుర్చీ కునికిపాట్లు
కిరణాల ఊలు స్వెట్టర్ అల్లుతూ ప్రకృతి

మాట మాటతో తగువు
గాలి టెర్రరిస్టులా చొరబడే
తలుపు చెంప ఛెళ్ల్ మనే
కిటికీ జాలిగా టకటకా రెక్కలచప్పుడు

పేపర్ ఎగిరెగిరి పడుతుంటే
పుస్తకాలు నోరావలించే
నీళ్ళకూజా ధన్ మని దొర్లే
బల్లచేతినుంచి కలం జారే

గాలి బలంకి గదంతా చిందరవందర గందరగోళం
వాడిన పూరేకుల్లా కాలెండర్ కాగితాలు!చిత్తుబుట్టలోని చెత్త
ప్రాణికి ఆధారం గాలి
అందుకే పోవద్దు దాని జోలికి 🌹

కామెంట్‌లు