చూస్తున్నాడు! (చిట్టి వ్యాసం)- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఏడు గుర్రాలెక్కి సూరీడు జగమంతా తిరిగి చూస్తున్నాడు. నింగిలోని చుక్కలన్ని భువిపై నిలిచి అంగనలచేతిలో రంగుల రంగవల్లులై తనిసిపోవడం, ప్రతికుటుంబం పాడిపంటలతో సిరులొలకడం, ప్రతిఇల్లూ పిండివంటలతో ఘుమఘుమలాడడం, ఇల్లిల్లూ పచ్చని సంతోషతోరణాలతో వెలిగిపోవడం, భువిపైని పూదోటల రంగులన్నీ
నింగిలో గాలిపటాలై సయ్యాటలాడి అలరించడం, ఉత్తరాయణంలో సంచరించే వేవెలుగుదొర సంతోషాంతరంగుడై చూస్తున్నాడు. ప్రతిగడపముందు గొబ్బిళ్ళఅర్చన, పాటలు, ఆటలు, బసవన్నలనాట్యాలు, బుడబుక్కలగోల, జనులకు జంగమదేవర దీవెనలు ఇవ్వడం, హరిదాసుల శ్రీరంగ కీర్తనలు మిన్నంటడం, ఊరిలోని జనుల కోడిపందాల కోలాహలం, సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటి ప్రతిపల్లెకు జీవకళను తీసుకురావడం, మకరరాశిని చేరిన మార్తాండదేవుడు మింటనిలబడి మట్టిపై వేడుకలను చోద్యంగా చూస్తున్నాడు!!!
+++++++++++++++++++++++++

కామెంట్‌లు