సమస్యాపూరణం";- మచ్చ అనురాధ-సిద్దిపేట
  దారము లేని దండ వనితా!  కనువిందొనగూర్చె  జూడుమా! 
==========================================
తీరగు పుష్పముల్ తిరిగి దెచ్చిరి పూజకు బాలబాలికల్
వేరుగ జేసి పూవులను వేగిర మే, కడు ముద్దు ముద్దుగన్
హారము గ్రుచ్చి ,జూడగను హా, యని యద్భుతమంచు మెచ్చు, మం
దారము లేని దండ వనితా కనువిందొన గూర్చె జూడుమా!.

కామెంట్‌లు