.చిన్నారి బాలలు ; -ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి.
చిట్టిచిట్టి  బాలలు చిన్నారి బాలలు 
చేయిచేయి కలిపి ఆడుదాం రండి .
చెమ్మచెక్కా చారడేసి మొగ్గ అంటూ 
పంటలేసి దొంగాట లాడుదాం చెండాటలాడుదాం  
మనకు వ్యయామము ఎంతో ఆ‌రోగ్యమూ .. ( చిట్టిచిట్టి)

చకచక రండి  బాలలు  
పొన్నారి బాలలు  
అటుఇటు నిలబడి తాడాటలాడుదాం  
కుందుళ్ళాటలాడుదాం  కలివిడిగా 
స్నేహంగా ఆడినా ఎంతో 
ఆనందము మనకు ఎంతో సంతోషము.. (చిట్టిచిట్టి)

గబగబ రండి బాలలు 
కన్నారి బాలలు  బాలశిక్ష పుస్తకం చదువుదాం
ధరణిలోన ఉన్న విజ్ఞానం నేర్చి జ్ఞానాన్ని  పొందుద్దాం.
విజయమార్గలలో  నడుద్దాం  
అందరికీ ఆదర్శంగా నిలుద్దాం.. (చిట్టి చిట్టి)

కామెంట్‌లు