న్యాయాలు -242
వలీముఖ నారి కేళ న్యాయము
******
వలీ ముఖః అంటే కోతి.నారికేళః అంటే కొబ్బరికాయ.
కోతికి కొబ్బరి కాయ దొరికినట్లు...
దీనిని ఓ సరదా సామెతగా తీసుకోవచ్చు. మూర్ఖత్వంతో కూడా పోల్చవచ్చు.
కోతులు పరిణితి చెందిన జంతువుల జాబితాలోకి వస్తాయి.ఇవి చేష్టలలో మానవులను పోలి ఉంటాయి. వీటిది చంచల స్వభావమనీ, ఎక్కడా నిలకడగా ఉండవని మనకు తెలుసు.
అలాంటి చంచల స్వభావి అయిన కోతికి కొబ్బరికాయ దొరికింది.ఇంకేముంది దాని సంతోషానికి అవధులు లేవు. దాన్ని పట్టుకొని అటూ ఇటూ తిరిగింది. కానీ దానిలోని నీళ్ళు, కొబ్బరి ఎలా తీసుకోవాలో తెలియలేదు. ఎవరికైనా ఇవ్వడానికేమో దానికి మనసొప్పడం లేదు.
ఆ కొబ్బరికాయను కొట్టడానికి దాని శక్తి సరిపోలేదు. దానిని తీసికొని అడవంతా తిరిగింది.ఇతర జంతువులను అడిగింది. ఏ జంతువును అడిగినా అందులో వాటా అడిగాయి.దీనికేమో ఎవ్వరికీ వాటా ఇవ్వడం ఇష్టం లేదు. అలా దానిని ఎవరికీ ఇవ్వలేదు.దానిని చూసి ఆనందించడమే కానీ దాని రుచి చూడలేక పోయింది.
దీనిని రెండు కోణాల్లోంచి చూడాలి. మన దగ్గర ఉన్న దానిని పంచుకోవాలి.అందులోనే ఆనందం కలుగుతుంది అలా ఇష్టం లేకపోతే చూసుకుని మురవడానికి తప్ప దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించాలి.
ఇక రెండో కోణంలోంచి చూస్తే మనసు కోతి వంటిది.కొబ్బరికాయ అనే వాంఛను పట్టుకొని వేలాడుతూ వుంటుంది.దానిలోని తాత్విక సారాన్ని గ్రహించనూ లేదు.అలా గ్రహించేలా చేసే అంతరాత్మ యొక్క ప్రబోధాన్నీ పట్టించుకోదు. ఇలా చంచలమైన మనసుతో ఇంద్రియాలను జయించలేక అన్నీ తనకే కావాలనే స్వార్థంతో నిరంతరం స్థిమితం, స్థిరత్వం లేకుండా చరిస్తుంది. కాబట్టి అలాంటి వాంఛా వ్యామోహాల నుండి బయట పడేందుకు ప్రతి క్షణం ప్రయత్నించాలి.
జీవన సారాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి కానీ జీవితాన్ని తాత్కాలికమైన వాటి మీద దృష్టి పెట్టి ఐహిక సుఖాల కోసం వెంపర్లాడటం తగదని ఈ "వలీముఖ నారి కేళ న్యాయము" ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి