* సాధనా సాఫల్యం * కోరాడ నరసింహా రావు !
 వ్యవసాయ కాలం.... 
   మధ్యాహ్న విరామం...  
     ఆలి  కట్టిచ్చిన అన్నం...
       అందరూ కూచుని ఆరగించడం !!
ప్రతీ మెతుకూ ఇచ్చినశక్తి తో 
  వంద ధాన్యపు గింజలను 
    ఉత్పత్తి చేసే పరిశ్రమ !
    అన్నదాతఅనిపించుకునే 
          భాగ్యమే గానీ... 
      రైతు కెక్కడిదీ.... 
..    జీవన ఆనందం... ?!
అతివృష్టి - అనావృష్టి... 
   సారం లేని విత్తనాలు, కల్తీ ఎరువులు !
    గిట్టుబాటులేని ధరలు, అడ్డదారిలో దళారీలు !
    భరించలేని అప్పులు, తీర్చలేని వడ్డీలు !
    
రోజులు మారుతున్నై.... 
    రైతుల  బతుకులూ మారుతున్నై.. !
   పరిష్కారం పురుగుల మందులో, వేలాడే ఉరితాల్లోకాదు !!
    సమైక్య పోరాటాలు... 
    హక్కుల సాధన... 
      రైతే... రాజుగా..... 
..   పేరు, ప్రఖ్యాతులతో... 
     ఆనందమయ జీవన సాధన !!
..   *******

కామెంట్‌లు