వృద్ధులే.. ఐనా వ్యర్థులు కారు.. ! కోరాడ నరసింహా రావు
వృద్ధు డైపోయాడని... 
.   వ్యర్థుడనుకోకు.... !
 అతడు వేసిన బీజమే నీ తాత తండ్రి, నువ్వూ.... !!!
    నీలో... ఇపుడాతడు యవ్వనుడై నిలిచి వున్నాడు !
     నీ జ్ఞాన, విజ్ఞాన సౌధానికి పునాది ఆతడే.... !
    ఆతని అనుభవం నీకో మంచి సలహా ఔతుంది... 
   ఆతని సూచనలు నీ విజయ సోపానాలే... !
     అది తలపండటం కాదు... 
 అనుభవం పరిపక్వత చెందటం !!
... వృద్ధులను అసహ్యించు కోకు... !
     ప్రేమతో  అనుసరించు !
.. రేపు నీ వృద్దాప్యాన్నీ... 
   నీ  మనుమలు, మునిమనుమలూ... 
 అలాగే... అభిమానించి, ప్రేమను పంచాలి కదా..... కదా !
.... ఉన్నంతకాలం ఆ వృద్ధులను కన్నబిడ్డల్లా ప్రేమించాలి !
  వారు  పోయినా.... కల కాలం మన మనస్సులో నిలుపుకోగలగాలి !!
*********

కామెంట్‌లు
Popular posts