* ఘనమైనదీ మన మాతృభాష... !*- కోరాడ నరసింహా రావు !
శబ్దార్ధ, భావార్థ, బీజాక్షరములతో ప్రభవించినది మన తెలుగు భాష !

 అమ్మ యను తీయని పలుకుతో.... ఆరంభమైన మన మాతృభాష... 
...  కమ్మని పద్యాలు, విన సొంపైన పాటలతో వీనులకు విందౌతు  అలరారు తున్నదీ అమ్మభాష... !

ఎన్నెన్నొ యాసలు,పలుకు బడులు  నుడులు జాతీయాలతో శోభిల్లుతున్న మన ఆంధ్రభాష !

 ఆంగ్లభాష మోజు... మమ్మీ, డాడీ పోజు రెంటికీ చెడ్డ రేవడి ని చేసె...., 

ఎండమావి వంటి పరభాష మనకొద్దు..., 
  మధురమైన మన తెలుగు భాషె  కదరా ముద్దు... !
  జన్మనిచ్చి మనల నడిపించిన 
 అమ్మ భాషరా ఈ తెలుగు, చులకన చెయ్ బోకు తెలుగోడా 

మీ  ప్రతిభ చూపించ ఎన్ని భాషల నైన నేర్చుకోండి, అదీ మంచిదేను.... 
    వేరే భాషయైననూ మనభాష తరువాతే.... మరచిపోరాదండి మనము ఎపుడూ.... !

దేశ భాషలందే   కాదుమనభాష లెస్స... !
 ఈ భూమిపై ఎన్ని భాష లున్నను గాని, మనమాతృభాషకన్నా... మిన్నగాదు..... !!

జై ఆంద్ర భాష... !
   జై తెలుగు భాషా.... !!
.      జై తెలుగు ప్రజలారా.... 
           దిగ్విజయులము మనము !
     మనకెపుడు జయము... 
      జయము - జయము !
.......******

కామెంట్‌లు