అజ్ఞానం!!;- సునీతా ప్రతాప్
జ్ఞానాన్ని వినోదంగా మార్చండి కానీ
వినోదాన్నే  జ్ఞానంగా మార్చకండి!!

భావోద్వేగాలు
బాధ వల్ల భయం వల్ల పుడతాయి!!
జ్ఞానం వల్ల వీడిపోతాయి!!

కొన్నిసార్లు ఏడిస్తేనే బాగుంటుంది
కొన్నిసార్లు చచ్చిపోతేనే బాగుంటుంది.!!

అంటే జ్ఞానం చచ్చిపోతేనే అలా ఉంటుంది

వినోదం భావోద్వేగాలు జ్ఞానాన్ని చంపేస్తాయి.!
జ్ఞానం భావోద్వేగాలను వినోదాన్ని చంపేస్తుంది.!!?

జాగ్రత్తగా గమనిస్తే మన సమాజం
భావోద్వేగాలతో వినోదంతో మొత్తం వ్యాపారం చేస్తుంది.!!!?
జ్ఞానంతోనే జీవితం మొత్తం కొనసాగుతుంది

భావోద్వేగాలు వినోదం భ్రమలు సృష్టిస్తాయి
జ్ఞానం నీకు నిజం చెప్తుంది!!

చచ్చేదాకా బ్రతకాలనేదీ జీవితం!!
చావే లేకుండా బ్రతకాలనేదీ జ్ఞానం!!!

****     *** ‌.   ***
Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏

కామెంట్‌లు