అల్లరి చేసే మా బాబు
అందని ఆ చందమామ
నీ ముందుకే వస్తుంది
ఎలా ఎందుకో తెలుసుకో !
గోల ఆపి ఓ బాబు
ఏమిటో అది కనుక్కో
ఎలాగో ముందుకు వెళ్లి
జాబిల్లిని చూడు బాబు
గగనతలము పై నుండి
పొగ చిమ్ముతూ పోతుంది
అది ఏమిటో తెలుసుకో
మనసు నిండా నింపుకో
చంద్రుని పై చేరబోయే
అందమైన రాకెట్ అది
దాని పేరు చెప్పనా
చంద్రాయన్ -3 వ్యోమనౌక
చెప్పే మాటలు విన్నావా
శ్రద్ధగా నీవు చదువుకుని
చంద్రునికై శోధించి
సాధన చేసి చూడు బాబు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి