సర్పయాగం;- కొప్పరపు తాయారు

 వ్యాస మహర్షి నాగుల చరిత్ర రాశారు
          కస్య ప్రజాపతి భార్యలు కద్రువ వినుత. ఆయన తపస్సుకు వెళుతూ వారు చేసిన సేవలకు అడిగాడు,ఏమి వరం కావాలని.దానికి కద్రువ  పుత్రులు వేయి మంది  కావాలని కోరుకుంది.వినుత బలమైన పుత్రులు ఇద్దరు కావాలి అని కోరుకుంది. వేయి గుడ్లు  కద్రువకు.    రెండు గుడ్లు లభించాయి. 
వినితకు. కద్రువ గుడ్ల నుంచి.  వేయి పాములు వచ్చాయి. వినుతకు ఇంకా తన గుడ్ల నించి పిల్లలు రాలేదని ఆశతో ఒక గుడ్డు పగలగొట్టింది ఆ గుడ్డులోంచి తొడలు వరకు ఉన్నటువంటి బిడ్డ కలిగాడు. వెంటనే శపించాడు
 500 సంవత్సరాల బానిసగా ఉంటావని నీ రెండో బిడ్డను రక్షించుకో అతడే నిన్ను బానిసత్వం నుంచి విడిపిస్తాడు అని చెప్పాడు.ఆ కుమారుడు.
         ఇది జరిగిన తర్వాత కద్రువ, వినుత  ఇద్దరూ వ్యాహ్యాళికై వెళ్లి అక్కడ ఒక అశ్వాన్ని చూస్తారు. తెల్లగా ఉంది. కావాలని కద్రువ దాని తోక నల్లగా ఉంది అంటుంది. తెల్లగా ఉంది అన్న వినుత ఇద్దరు వాదించుకొని రేపు తెల్లవారి వచ్చి చూద్దాం అది తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, లేకపోతే నువ్వు నాకు దాస్యం చేయాలి అని.ఒప్పందం.పెట్టింది కద్రువ
     ఇంటికి వెళ్లి పాములుతో మీలో వెళ్లి ఎవరో ఒకరు వెళ్లి దాంట్లో నలుపు చూపెట్టండి అంటే అది ధర్మం కాదు, న్యాయం కాదని, ఒప్పుకోలేదు .కొంతమంది వారందరినీ మీరు సర్పయాగంలో మరణిస్తారు అని చెప్పింది.అని శపించింది. అప్పుడు తక్షకుడు వెళ్లి గుర్రం తోకకు చుట్టుకున్నాడు. ఆ రకంగా ఆమెను గెలిపించాడు.
             కుమారుడి శాపం,పందెంలో ఓటమి వినుతను 500 సంవత్సరాల దాస్యం అనుభవింప
చేసింది.
           పరీక్షిత్తు మహారాజు అభిమన్యుని కొడుకు
పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు,తన తండ్రిని
తక్షకుడు కాటు వేయడం వల్ల మరణం సంభవించిందని, తన తండ్రిని చంపినవారి వంశం
నాశనం చేయాలనే పట్టుదలతో పేద్ద సర్పయాగం
చేయ సంకల్పించాడు. ఆ సర్పయాగం ఎంత బలమైనది అంటే ఎక్కడెక్కడ ఉన్న పాములు హోమగుండంలో పడిపోతున్నాయి .
        అప్పుడు తక్షకుడు తనని రక్షించుకోడానికి
తన సోదరి అయిన జరత్కారి వద్దకు వెళ్ళాడు.
జరత్కారి భర్త జరత్కారుడు  వారి పుత్రుడు ఆ‍స్థికుడు ఈతడు‌ మహాజ్ఞాని, పండితుడు.
ఇతనిని వెళ్ళి ఆ యాగాన్ని ఆప ప్రయత్నం చేయమంటే. ఈతడు ఆ రాజు జనమేజయుడుని
తన విద్వత్తు తో పొగిడే సరికి సంతోషపడి ఏం
వరం కావాలో కోరుకోమంటే, యాగం ఆపమని
ప్రార్థించాడు.ఆ. విధంగా తక్షకుడు రక్షింప బడ్డాడు.
కామెంట్‌లు