న్యాయాలు -224
రూప సామ్య న్యాయము
****
రూప అంటే ఆకారము , వర్ణము, సౌందర్యము, నాటకము, స్వభావము అనే అర్థాలు ఉన్నాయి. సామ్యము అంటే సమానత, సమత్వము,పోలిక అనే అర్థాలు ఉన్నాయి.
ఆకారము ,వర్ణము మొదలైన పోలికల చేత రెండు వస్తువులను ఒకటిగా భావించుట అనే అర్థంతో ఈ "రూప సామ్య న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
అంటే చూడటానికి కొన్ని ఒకేలా కనిపించినా ,కనిపిస్తున్నాయని చెప్పినా స్వభావం, లక్షణాల పరంగా వేరే వుంటాయి. అలా సామ్యం/ పోలిక చూపినంత మాత్రాన ఒకటి కావు.అలా అనుకుంటూ తృప్తి పడితే చేసేదేం లేదు. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు వాటి లక్షణాలే ..ఏదేమిటో తెలిసేలా చేస్తాయనే అంతరార్థం ఈ "రూప సామ్య న్యాయము"లో ఇమిడి వుండటం గమనించవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో చూసినట్లయితే అసలు వస్తువులకు ,వెండి బంగారు,నగలకూ, చీరల్లాంటి వివిధ వస్త్రాలకు పూర్తి నకలీవీ, యథాతథ అనుకరణతో చూడటానికి జిరాక్స్ కాపీల్లా కూడా కాదు అసలు వాటిని మించినవిగా, నమ్మకం కలిగించేలా వస్తున్నాయి.
అందుకే అసలువి అత్యంత ధర పెట్టి కొనలేని వాళ్ళు నకిలీ, అదే నమూనా వాటితో తృప్తి పడటంలో ఫర్వాలేదు కానీ అసలైనవనుకొని నకిలీవి కొని మోస పోకూడదు. కాబట్టి నిశితంగా పరిశీలిస్తే నాణ్యతలో తేడా కనిపిస్తుంది.అందుకే మన పెద్దలు "మెరిసేదంతా బంగారం కాదు" 'తస్మాత్ జాగ్రత్త' అనే సామెతను వాడుతూ హెచ్చరించడం చూస్తుంటాం.
అలాగే పక్షులైన కాకి కోకిల ఒకేలా కనిపిస్తాయి కానీ వాటి స్వర స్వభావమే ఏదేమిటో తెలిసేలా చేస్తాయన్నది మనకు తెలిసిందే.
ఇది కేవలం వస్తువులలో,పక్షులలోనే కాదు వ్యక్తుల్లో కూడా ఉంటుంది.జాగ్రత్తగా గమనించమని రాసిన ప్రజాకవి వేమన పద్యాన్ని చూద్దాం.
"ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు/ చూడ చూడ రుచుల జాడ వేరు/ పురుషులందు పుణ్య పురుషులు వేరయా/ విశ్వధాభిరామ వినురవేమ!"
ఉప్పు కర్పూరం చూడటానికి రెండు ఒకేలా కనిపిస్తాయి కానీ రుచులు వేరు అలాగే మనుషులంతా ఒకే విధంగా కనిపించినా అందులో మంచి వారు వేరుగా ఉంటారు. అది గమనించాలంటే మనలో విజ్ఞత,నిశిత దృష్టి ఉండాలి.
అప్పుడే ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిజం ఏది అబద్దం అనే విచక్షణా జ్ఞానం కలుగుతుంది.
ఇదండీ! "రూప సామ్య న్యాయము" లోని అర్థము, అంతరార్థము.ఇతరులు మనల్ని ఇత్తడినా,పుత్తడినా మనసులో అనుకుని సందేహ పడినా మనము మాత్రం నిక్కమైన బంగారంలానే ఉందాం.సమయం వచ్చినప్పుడు మనమేంటో వారికే తెలుస్తుంది.అర్థం అవుతుంది.అంతే కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి