తరువులే మనకు గురువులై.. !;- కోరాడ నరసింహా రావు.
చెట్లను నరుకుతున్నా మనుకుంటూ... మనుషులు 
తమచేతులనే తాము  నరుక్కుంటున్నారు !

మనిషి పూ ర్ణ త్వ సిద్ధికి సంపూర్ణంగా సహకరిస్తున్న 
తఱువులను, నిలువునా నరికివేస్తున్న 
మనిషి అవివేకపు అజ్ఞానానికి బాధపడి....
 చెట్లు, పుడుతూనే ఉన్నాయి,మనిషికి  
ఎన్నెన్నో ఇస్తూనే ఉన్నై... !

భూజములు లేనిదే...సేద దీర్చి 
 హాయిగొలిపే ఆ చెట్ల  నీడ... చల్లని గాలు లెక్కడ !?

పరిమళ పూలు, కా  య లు 
పండ్లు లభించేదెలా... ?!
   మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ ను 
డబ్బులిచ్చి కొనుక్కో నవసరం లేకుండా... 
 ఉచితముగానే అందరికీ వితరణ ఈ చెట్లేగా వితరణ గావి స్తున్నవి.. !!

ఈ చెట్లే వర్షమునకు మూలము కాదా... చక్కని పంటలు పండి ప్రాణికోటి సుఖ, సంతోషములతో వర్ధిల్లుటకు 
.. ఇవేకదా  మూలము, !

అవసరాలకు మించి.... మీ స్వార్ధ సుఖానంద భోగాలకు 
  ఎన్నెన్ని అడవులు అంతరించిపోతున్నాయని !?

ఈ మనిషి పాపాలే కదూ..... 
  అతివృష్టి, అనావృష్టి,.... 
  ఇన్నిన్ని, వ్యాధులు, బాధలకు
 కారణం !!

వృక్షము... తన సర్వస్వమును 
మనిషికి  నిస్వార్ధ త్యాగ బుద్దితో సమర్పిస్తూ...., మనిషికి త్యాగనిరతిని నేర్పుతోంది.... !
    తరువులు మనకు గురువులై ..,చెబుతున్నవి 
    మీరు మమ్ము గొడ్డళ్లతో నరికి, రంపాలతో కోసినా... 
   మాతనువులను మీకనువైన రూపాలుగా మారి మిమ్మానందింప జేస్తున్నట్టే... 
   మీరును మరణానంతరము వృధాగా మట్టిపాలు గాక.... 
  అవయవ శరీర, దానము చేసుకుని మఫా నలుగురి రూపంలో, బ్రతికి, వారిజీవితాలలోనూ ఆనందపు వెలుగుల్ని చూడండి 
 మీరూ మాలానే... మరణా నంతర జీవనాన్ని పొందండి 
 మాలా... మీరూ. మీ మీ  జన్మలను సార్ధకం చేసుకోండి 
      *******

కామెంట్‌లు