మానసిక రోగులను ముఖ్యంగా దిమిన్షియ డిప్రెషన్ పార్కిన్స న్యూస్ మొదలగు రోగులకు వైద్యం అందిస్తూనే, మానసిక వికాసానికి మానసిక ఉల్లాసానికి మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి, సాధారణంగా మనం వాళ్ళ పరిసరాలు ప్రాంతాలు మనుషులు వాతావరణం మొదలగు వాటి కోసం ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాం. అంటే వాళ్లకు ఉల్లాసభరితమైన విజ్ఞానవంతమైన వీడియోలను చూపిస్తుంటాం. అందులో కాంటెంట్ భావోద్వేగాలకు సంబంధించినవి ప్రకృతికి చెందిన సహజమైన దృశ్యాలకు ప్రాధాన్యతనిస్తాం. వీటిలో భావోద్వేగాలకు సంబంధించిన దృశ్యాలు వాళ్లను ఆకట్టుకొని ఇన్స్పిరేషన్ ను స్పందనను కలిగిస్తాయి కానీ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే భావోద్వేగాలకు సంబంధించిన విషయాలు వీడియోలు ఎంత ప్రభావితం చేస్తాయో అంతకన్నా ఎక్కువ ఆడియో వ్యవస్థ ప్రభావితం చేస్తుందని ప్రయోగాలు చెబుతున్నాయి.
కేవలం వీడియో వళ్ళనే మానసిక రోగులనే కాక మామూలు మనుషులను కూడా వీడియో ఎక్కువ ప్రభావితం చేయదు. ఇది సర్వసాధారణ విషయమే కానీ వీడియోకు ఆడియోను జోడిస్తే కలిగించే ఫలితం భిన్నంగా ఉండటానికి మనం గమనిస్తాం. అంతే వీడియో కన్నా ఆడియో అత్యంత ప్రభావితమైంది శక్తివంతమైంది ప్రమాదకరమైంది కూడా. ఇంత ప్రమాదకరమైన ఆడియో వ్యవస్థను సరైన కంటెంట్తో మనుషులపై ప్రయోగిస్తే గొప్ప ఫలితాలు పొందుతాం.
నిజానికి విజువల్స్ కన్నా సౌండ్ సిస్టం మనిషిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. సౌండ్ సిస్టం లేకుండా విజువల్స్ ను మనం చూడలేం. అందుకే విద్యార్థులు కూడా విజువల్ కన్నా సౌండ్ సిస్టం అంటే ఆడియోతో అత్యంత ప్రభావిత ఫలితాలను పొందుతున్నారు. అంటే విజువల్స్ కన్నా ఉపన్యాసము అత్యంత ప్రమాదకరమైంది. ఒక్కసారి మనం వినటం ప్రారంభిస్తే చివరి వరకు కొనసాగించాల్సిందే.
కంటెంట్ ఏదైనా విజువల్స్ ను కూడా మోసుకెళ్ళే ఒక రవాణా వ్యవస్థ లాంటిది శబ్దం. ఉపన్యాసము మాటలు సంగీతము శబ్దం అత్యంత ప్రమాదకరమైనదీ. విజువల్స్ ను ఊరు శాతము కమ్యూనికేట్ చేయాలంటే శబ్దం అవసరం. కానీ శబ్దాన్ని కమ్యూనికేట్ చేయడానికి విజువల్స్ తో పనిలేదు అన్నది మనం భాష పుట్టనప్పటి కన్నా ముందు నుంచి గమనిస్తున్నాం.
భావోద్వేగాలకు సంబంధించిన హార్మోన్స ఎక్కువగా ఎంత శ్రావ్యమైన శబ్దానికి ఎట్లా స్పందిస్తాయో, అంతకన్నా ఎక్కువ శబ్దానికి భావోద్వేగాలకు సంబంధించిన హార్మోన్స్ ను శరీరము మెదడు విడుదల చేస్తుందని మనం గమనించాలి. మానసిక రోగాలకు కారణమైన హార్మోన్స్ ను మనం విజువల్స్ ను మోసుకెళ్ళే శబ్దానికి అంటే ఆడియో వలన సంతులనం చేయవచ్చని ఈ వ్యాసం వలన మీరు అర్థం చేసుకుంటే చాలు...!!!!!
15th August స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి