“మార్గదర్శి” నాన్న( మొగ్గలు)-:అన్నపూర్ణ యంజాల -షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా
నిత్యము నేనుచూసే ప్రవాహమే
వీపు చరిచి కొత్తగా వివరిస్తాడు
జోకొడుతూ మేల్కొలుపుతాడు నాన్న. 

లక్ష్యానికి లక్షణాలద్దుతూ
అనుభవాల వానై వర్షిస్తాడు
జ్ఞానబీజాల్ని మొలకెత్తిస్తాడు నాన్న. 
 
బాల్యానికి భవిష్యత్తుకు పూలవంతెనై
 రెక్కలునమిరి ఎగరేసే మార్గదర్శి
అలుపెరుగని ఆదిగురువుఅవనియందు నాన్న. 

వేలుపట్టి నడిపిస్తూ విలువలు నేర్పిస్తూ
నిరంతరం మనతరం గెలుపుకైశ్రమిస్తాడు
నీడనిచ్చే చెట్టై ఎదిగితే గర్విస్తాడు నాన్న. 

నాన్నజ్ఞాపకాలు పసిడి కిరణాలై
మనసు తెరపై ప్రజ్వలిస్తాయి
గుండెగుడిలో అనునిత్యం చిరంజీవి నాన్న. 

ఈకవిత మా నాన్నగారు యంజాల లింగయ్య (టీచర్)గారి జ్ఞపకాలతో రాశాను. 

కామెంట్‌లు