"భరత ఖండoబు..." ;- "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,సంచార వాణి: 99127 67098
  మన "భరత ఖండము"
 శ్రేష్ఠమైన గంగిగోవు!
    కమ్మని క్షీరమొసగు!
  ఓ ఆత్మ బంధువు లార!
       ( ..అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
 🚩 మన భారదేశము.. ఆ సేతు హిమాచలం పర్యంతం, భూభాగం కల్గియున్నది! గంగా, గోదావరి.. మున్నగు జీవనదులతో.. సుసంపన్న మైనది! పలు విధములైన సంస్కృతీ సంప్రదాయములతో శోభిల్లుచున్నది! అట్టి "భరత ఖండము".. చక్కని "పాడియావు"వలె విరాజిల్లు చున్నది!
 🚩స్వదేశీయులలో అనైకమత్యము వలన, విదేశీయుల దురాక్రమణకు గురైనది! ఆ సమయములో భారతీయు లందరూ పలుకష్ట నష్టములను అనుభవించారు! బానిసత్వం నందు మ్రగ్గి పోయారు! అందువలన, "స్వరాజ్యమే నా జన్మహక్కు" అని, నినాదంతో హిందువు లందరూ; తమ తనువు, మనస్సు, ధనములను స్వాతంత్ర్య సంగ్రామంలో సమర్పణ కావించారు!    
🚩 మనభరత ఖండమును..  ఒక "చక్కని పాడిఆవు"గా, విధర్మీయులు వినియోగించు కున్నారు! సనాతన ధర్మమును అనుసరించు ... శైవులు.. వైష్ణవులు.. శాక్తేయులు.. గాణాపత్యులు.. సౌరులు... బౌద్ధులు... జైనులు.. సిక్కులు..  మున్నగు హిందువు లందరూ  లేగదూడల వలె ఏడ్చు చున్నారు! ఎట్లనగా.. గోవు లేగదూడల మూతులు  బిగగట్టి, "తెల్లవారు" అనే విదేశీయులైన, గడుసరి గొల్లవారు; పాడియావు పాలను పితుకుకొను చున్నారు! 
    ఆ విధంగా ఆంగ్లేయులు.. మనదేశ సంపదను దోచుకున్నారు! స్వదేశీయులపైన మనందరిపైన కర్రపెత్తనం చలాయించారు!
🔆ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమ పరిస్థితిని.. ప్రముఖ కవి, ఈ"చాటు పద్యము"నందు పేర్కొన్నారు.
🚩 తేట గీతి పద్యము   
    భరత ఖండంబు, చక్కని పాడియావు
    హిందువులు లేగదూడలై,  యేడ్చు చుండ
     తెల్లవారను గడుసరి, గొల్లవారు
     పితుకు చున్నారు, మూతులు బిగియ బట్టి!
    ( జాతీయోద్యమ కవి., శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం.,)

కామెంట్‌లు