సెప్టెంబర్ 17 విమోచనమో విలీనమో నిరంకుశ పాలనకు సమాధి- శిరందాస్ శ్రీనివాస్హైదరాబాద్-9441673339
సెప్టెంబర్ 17, 1948
నిజాం నిరంకుశ పాలనకు
అంతిమ దినం
నర హంతకులు కిరాతకులు
రజాకార్ల ఆగడాలకు
ఘోరి కట్టిన దినం..
హైదరాబాద్ సంస్థాన ప్రజలకు
దృష్ట పాలన నుండి 
విముక్తి పొందిన దినం..

భాషా, సంస్కృతి 
సంప్రదాయాల అణచివేతకు 
మత మార్పిడులకు
మహిళల మాన ప్రాణాల 
హననానికి పాల్పడ్డ నిజాం
రక్షకులే భక్షకులై దేశాన్ని దోచుకున్న నిర్లజ్జ నిజాం పాలనకు 
పాడే గట్టిన దినం..

రెండు భిన్న ధృవాలు
కమ్యూనిష్టులు, ఆర్యసమాజ్
ప్రముఖ్ లు ఏకమై 
అరాచక పాలనకు 
అడ్డుకట్ట వేసిన దినం..
శతాబ్దాల అసబ్జాయి 
రాచరిక పాలనకు స్వస్తి వాచకం
స్వతంత్ర్య భారతావని పాలనకు
నాంధీ వాచకం

విలీనమో విమోచనమో
భారతావనిలో సమైక్యమో..
రాక్షస పాలనకు ముగింపు
ప్రజాస్వామ్య పాలనకు చాటింపు
కాశీం రజ్వీ ఆగడాలకు చెల్లు చీటీ.
బాంచన్ కాల్మొక్తా ఆన్న
నిజాం నిరంకుశ బానిసత్వపు
సంకెళ్లకు చరమ గీతం.


అపరేషన్ పోలో
వల్లభభాయి రాజనీతి
పోలీసుల కవాతు
భారత సేనల బూట్ల సవ్వడి 
నిరంకుశ నవాబు గుండెల్లో 
రైళ్లు పరిగెత్తించే..
ఎవరికీ తలవంచని నవాబు
వంగి వంగి సలాం చేసిన దినం


సామంతులు జాగిర్థారులు 
గులాములు  ఎందరో 
పలాయనమైన దినం
మువ్వన్నెల జెండా గోల్కొండ పై రెప రెప లాడిన దినం..
హైదరాబాద్ సంస్థానం
భారతంలో విలీనం
నిజాం నిరంకుశ పాలన నుండి
తెలంగాణ, మరట్వాడ బీదర్ ప్రజలకు విమోచనం
స్వతంత్ర భారతంలో ప్రజలు సమైక్య దినం 



;

కామెంట్‌లు