నా కలం;- కేశరాజు వేంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం 6281697982
 కీకారణ్యంలో,
కాలసర్పాల కాలుడి కౌగిలిలో
అడవి బిడ్డల ఆరిపోయే జీవితాలకు
నా కవన జ్యోతులే, కాంతి రేఖలు !!
సంజీవని సుధ ధారలై, అపమృత్యువును
అంతం చూసెడి, అపర కాళికా నాలికలు !!
చింకి పోయిన,ఈత చాపల గూడులో,
గుడ్ల నీరు ఇంకి పోయి,
క్వారీలో రాళ్ళు గొట్టే,రాతి మనుషుల జీవితాలకు,
వెన్నరుద్ది వెతలుతుడిచి,వైభవాలను పంచునట్లు
కవితలల్లే కాంతి యేదో, కలం నుండి జాలువారెను !!
శ్రమదోపిడి చేసే,దొడ్డ మనుషుల దొడ్డిలోన 
కట్టుబానిస చిట్టిచేతులు,చిందిన రక్తధారలు 
బొట్టు బొట్టు రాలి, విప్లవాగ్నిజ్వాలలై
మండుతున్న సూర్యులెందరినో
ప్రసవించెను నా కవనం !!

నిర్జించెను నికృష్టుల,వర్జించెను దోపిడీలు
అక్రమాలు అరికట్టే,పర్జన్యమై,గర్జించిన నా కవనం
కామెంట్‌లు