బ అక్షర కవిత;- పద్మావతి పి-హైదరాబాద్--మొ.నం.6302093356
బుడిబుడి తడబడు నడకల అడుగులు
బిర బిర పరుగులు తీసే నడకలు
బంగరు కలల కానుకలు
బాలలు ప్రేమకు పెన్నిధులు..

బంతుల పూబంతులతో ఆటలు
బాలల నవ్వులు విరిసిన మల్లెలు
బతుకమ్మలు ఇంటికి లక్ష్మీ సంపదలు
భలే భలే! రంగుల హరివిల్లులు..

భేదాలే తెలియని వయసులు
భోళాబాలా  మనసులు
బుద్ధికి బృహస్పతులు
బంగరు తల్లికి మమతల ముద్దులు..

బంగరు లేడిలా గెంతులు వేసే మెరుపులు
బృందావనమునకు కన్నయ్యలు
బంతులు  చేమంతులు విరబూసిన మల్లెల సిరి సంపదలు..

బిలబిల చరచర నడకలతో 
బడి ఒడికే చేరిన
గువ్వలు
భువనానికి ఎగసిన బావుటాలు
భగవంతుని హృదిలో
స్వచ్ఛ స్వేచ్ఛా స్వరూపాలు..
************************


కామెంట్‌లు