బాలగేయం;- పద్మావతి పి- హైదరాబాద్-..6302093356
విమల కమల నేస్తాలు
శ్రమతో కలిపెను హస్తాలు

ద్వేషం తెలియని వయసులు
ప్రేమను పంచే మనసులు

కలకలలాడే నవ్వుల పువ్వులు
స్వచ్ఛంగా పారే సెలయేరులు

స్నేహం అంటే ప్రాణం ఇస్తారు
అందరితో కలిసి మెలిసీ ఉంటారు

ఆటల పాటల అల్లరి పాపలు
ప్రతిభా చాతుర్యంలో రాణులు 

వినయ విధేయతలలో
పోటీ లేరెవ్వరు
సమతా మమతకు నెలవై ఉంటారు

అమ్మానాన్నల ఆశీర్వాదాలు
పొందిన వారి స్నేహ మాధుర్యాలు

ఆత్మీయానురాగాలే వారి సొంతం
మమతాను బంధాలే వారి ఆత్మీయం..
*****************

కామెంట్‌లు