నాటక పోటీల్లో;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మొదట నాటక పోటీలను ప్రారంభించిన రోజులలో  నాటకాల ఎన్నికల నుంచి  న్యాయ నిర్ణీతల ఎన్నిక వరకు  ప్రతిదీ పద్ధతి ప్రకారం  ప్రణాళిక బద్ధంగా  నాటక శాఖలో పరిణతి చెందిన  వ్యక్తులను మాత్రమే ఎన్నిక చేసుకునేవారు  నాటకాలలో కూడా  కథ కథనం  నటీనటుల ఎన్నిక  దర్శకుడు సామర్థ్యం కలిగిన వాడా లేదా  అన్న విషయాలను కూలంకషంగా ఆలోచించిన తరువాతనే  పోటీకి ఆహ్వానించేవారు. న్యాయబద్ధమైన  నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ శిరసావహించేవారు  ఒకవేళ తాను చేసినది  సరి అయినది  దానికి ఎందుకు బహుమతి ఇవ్వలేదు అని అడగవలసిన  వ్యక్తి స్వయంగా వెళ్లి  న్యాయ నిర్ణేతలలను పరిచయం చేసుకొని  నేను ఆ నాటకంలో  ఏమైనా తప్పులు చేసి ఉంటే చెప్పండి తరువాత ప్రదర్శనలలో దానిని సరిదిద్దుకుంటాను  అని వినయంగా అడిగేవాడు తప్ప  మరొక స్వార్థ బుద్ధి ఉండేది కాదు. మొదటి రోజుల్లో  న్యాయ నిర్ణేతలు  కొన్నిచోట్ల ముగ్గురు ఉంటారు లేదా ఐదుగురు ఉండవచ్చు  వారిలో పెద్దవారు  వారి నిర్ణయాన్ని  సభా ముఖంగా  ప్రకటించేవారు  ఇవి మాకు తోచిన  ఆలోచనలు  దీనిలో ఎవరికైనా అనుమానాలు వచ్చినట్లయితే  మాలో ఎవరినైనా కలిసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు  అని వేదికపైనే ప్రకటించేవారు  ఇవాళ వారు చేసిన నిర్ణయాన్ని వారు చదవడానికి భయపడే స్థితి  ఎందుకు వచ్చింది అంటే  మందుకు  మిగిలిన ప్రలోభాలకు  లోబడి పని చేయడం వల్ల పరిషత్ నిర్వాహకులు కూడా  తమ మాట వినే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో  వారిని  ఆర్థికంగా ఎవరు సహకరించగలరో వారిని ఎన్నిక చేసి  వారి ద్వారా  న్యాయాన్ని చేయమని చెప్తారు. ఇవాళ నాటక పరిస్థితులు ఎలా వచ్చాయి అంటే  పోటీ నాటకాల ప్రదర్శనలు పూర్తిగా అయిపోయిన తర్వాత  రెండు గంటల కాలం వేరే నాటకాలను తీసుకువచ్చి  ప్రదర్శింప చేయడం  ఆ సమయంలో న్యాయ నిర్ణేతలు ఒకచోట కూర్చుని  పరిషత్తు నిర్వాహకులు ఏది చెబితే దానిని కాగితాల మీద వ్రాసి వాటిని వారి చేతికి ఇచ్చి  చిరునామాలేకుండా వెళ్ళిపోతారు  నాటకాలు నిర్వహించిన వారికి ఎవరికైనా అనుమానాలు వచ్చి  మా తప్పులు ఉంటే చెప్పండి అని అడగడానికి వ్యక్తులు కూడా దొరకరు ఇవాళ ప్రతి వ్యక్తి అనుకునే మాట వీరి బహుమతి  డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది తప్ప వారి సత్తా చూపి తెచ్చుకున్నది కాదు అని  ఆ స్థితికి దిగజారడంలో  అనేకమంది పాత్ర  అందులో దాగి ఉన్నది అన్నది  నిస్సందేహం.



కామెంట్‌లు