సుధామూర్తి గారి అలవాటు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించి  సమర్థనీయంగా నడుపుతున్న నారాయణమూర్తి గారు వారి శ్రీమతి సుధ గారు  వారి వివాహం అయిన కొత్తలో నెలకు 300 రూపాయలు పుస్తకాలు కొనడానికి వినియోగించేవారు  నిజానికి ఆ రోజులలో ఆ మొత్తం  చాలా పెద్ద మొత్తమే  సుధా గారికి నారాయణమూర్తి గారికి వేరు వేరు  అభిరుచులు ఉండడం వల్ల వారు చదివే పుస్తకాలు వేరు వీరు చదివే పుస్తకాలు వేరు  నారాయణ మూర్తి గారికి  ది బెస్ట్ రైటింగ్ అఫ్ మ్యాథమెటిక్స్ పేరుతో అమెరికాలో ఏటా ప్రచురితమయ్యే సంకలనం అంటే ఎంతో ఇష్టం  అందులో ఈ ప్రపంచ  వ్యాప్తంగా ఉన్న మ్యాథమెటిక్స్ నిపుణులు రాసిన ఎన్నో అంశాలు ఆ పుస్తకంలో ఉంటాయట  అది తన అభిరుచికి తగిన పుస్తకం అని చెప్తారు  ఇష్టమైన పుస్తకం చదవడంలో ఉన్న తృప్తి ఆనందం మరొక దాంట్లో దొరకటం  కష్టం. ఇవాళ సుధా మూర్తి గారు అంటే తెలియని వారు భారత దేశంలో ఎవరూ లేరు  స్వతహాగా ఆవిడ రచయిత్రి  నిజంగా తాను రచయిత్రిగా రావడానికి కారణం తను చదివే  పుస్తకాలే అని చెప్తారు  స్మార్ట్ ఫోన్ వచ్చాక పిల్లలు సృజనాత్మక సాహిత్యానికి దూరం అవడాన్ని గమనించిన ఆమె వారి కోసం  ఎక్కువగా రచనలు చేస్తున్నారు ఏ సమావేశానికి వెళ్ళినా పిల్లల్లో చదివే శక్తిని పెంపొందించాల్సిన అవసరాన్ని నోటికి చెబుతున్నారు  దీనికి మూల కారణం పెద్దవాడు చదువుతూ ఉంటే చిన్నవాళ్ళు అనుకోకుండా వారు కూడా చదువుతూ ఉంటారు  పెద్దవాళ్లు చదవకుండా పిల్లని చదవమని చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు అని ఆమె నిశ్చితార్థ అభిప్రాయం  ఎంత ఎక్కువగా చదివితే అంత బాగా సమాజాన్ని అర్థం చేసుకుంటాం. మనకు చదివే అలవాటు లేకపోతే  జీవితంలో చాలా కోల్పోయినట్లే అన్న అభిప్రాయం సుధా మూర్తి గారికి  ఇంట్లో కూర్చుని మీరు పుస్తకాలు చదవడం వల్ల ప్రపంచం మొత్తం  మీ పరిధిలో ఉంటుంది అన్న విషయాన్ని గమనించింది.  ప్రతి ప్రాంతానికి వెళ్లి అక్కడ  వారి సాంఘిక ఆచారాలను కట్టుబాట్లను  ఆ ప్రకృతి దృశ్యాలను చూసే అవకాశం మీకు ఉండకపోవచ్చు  కనుక అవన్నీ తెలుసుకోవడానికి మీరు ఇంట్లో కూర్చుని హాయిగా  చక్కటి పుస్తకం ఏ విషయాన్ని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించిన పుస్తకాన్ని ఎన్నుకొని దానిని చదివితే  ఆ పరిసర ప్రాంతాలను అన్నిటినీ మీరు చూసినట్లుగానే భావించవచ్చు  అంత శక్తి ఈ పుస్తకానికి ఉంది అని నేను నమ్ముతున్నాను  అంటారు శ్రీమతి సుధా మూర్తి.


కామెంట్‌లు