స్త్రీ-- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ సమాజం పెరగాలి అంటే  కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి  వయసు వచ్చిన స్త్రీ పురుషులకు వివాహం జరిగే  వారి వల్ల సంతాన ఉత్పత్తి కలగడం వారంతా కలిసి సమాజంగా ఏర్పడి  అనేక సమస్యలను  పరిష్కరించుకోవడం  జరుగుతూ ఉంటుంది. ఇంటికి పెద్దలైన తల్లి తండ్రి  అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు  ఒకరిగా ఉన్నప్పుడు వ్యష్ఠిగా ఇద్దరూ కలిసినప్పుడు  వ్యక్తిగా  కుటుంబం మొత్తం కలిసినప్పుడు సమష్టిగా అని వాడుకలో ఉన్నది  వ్యక్తిగా తన ప్రయత్నం తాను చేస్తూ  సమాజ హితాన్ని కోరుకుంటూ  కాలానికి అనుగుణంగా  ఒకప్పుడు  కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఎక్కువ ఉంటే అంత గౌరవం ఉండేది  ఇప్పుడు ఎంత తక్కువ మంది ఉంటే అంత గౌరవం పెరుగుతోంది  దానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు.
సామాన్యంగా పురుషునికి  కుటుంబాన్ని పోషించడం కోసం ఏదో పని చేయవలసిన అవసరం ఉంటుంది  స్త్రీలు ఇంటి పనికి  పరిమితమై ఉన్నందున  వ్యవధి ఉన్న సమయంలో నలుగురు కలిసి వారి ఇష్టం వచ్చినట్లు  ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది  దానితో తగాదాలు వచ్చే  ప్రమాదాలు కూడా  ఉన్నాయి  స్త్రీ కి మూల దూషణం  అంటే అన్ని పాపాలకు స్త్రీలే కారణం  ఈ వాక్యం ఎందుకు పుట్టిందో ఎవరు పుట్టించారో చెప్పడం కష్టం  పాపపు పనులు స్త్రీలు మాత్రమే చేస్తూ పురుషులు పవిత్రంగా ఉండడం  ఏ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా ఉన్నదా  పొరపాటు అన్నది  పొరపాటును పొరపాటుగానే పరిగణించాలి. అలాంటిది ప్రత్యేకంగా స్త్రీలనే ఎంచుకొని చెప్పడం  ఎంతవరకు సబబు అన్నదానికి సమాధానం లేదు. ఎక్కడో కేరళ లాంటి ప్రాంతాలలో మాతృస్వామ్య వ్యవస్థ కుటుంబ  బాధ్యత చూసే ప్రధాన వ్యక్తిగా పరిగణించడం మనకు తెలుసు  స్త్రీకి ఆ బాధ్యత ఇవ్వడానికి కారణం  ఆమె సక్రమమైన పద్ధతిలో  ఎవరినీ నొప్పించకుండా  కుటుంబాన్ని చక్కగా సాకుతుంది  అన్న అభిప్రాయం కావచ్చు  పురుషుల కన్నా స్త్రీ మెదడు  బాగా పని చేస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు  పితృస్వామ్య వ్యవస్థలో కూడా  తల్లి పెంపకం అంటారు తప్ప తండ్రి పెంపకం అనరు కారణం ఆమె సహనం  చంటి పిల్లలను ఎలా సముదాయించాలో  వయసు వచ్చిన తర్వాత అతనిని ఎలా ఒప్పించాలో  అమ్మకు తెలిసినంత గొప్పగా  అయ్యకు తెలియదు అన్నది స్పష్టం  అలాంటి పరిస్థితులలో ఇలాంటి వాక్యాలు రావడం  అనవసరం అని నా భావన.

;

కామెంట్‌లు