వివేక చూడామణి;- - డాక్టర్ స్వాతి నీలం,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 32 సంవత్సరాల సంక్షిప్త జీవిత కాలంలో శంకరాచార్యుల వారు భారతదేశం మొత్తం పర్యటించి  అనేక  భాష్యములు  రచించి దేశపు నాలుగు చెరగుల నాలుగు మహాపీఠములను నెలకొల్పి  వేదము ఏదైతే మనకు బోధించినదో ఆ వేదము చెప్పిన నాగరికతకు  మతము ఎందుకు స్థాపించబడినదో  దాని చరిత్రను మొత్తం  చెప్పి దాని అవసరాన్ని కూడా  సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా బోధించినవాడు  భారతీయుడు మరిచిపోతున్న  సంస్కృతి సంప్రదాయాలను  తిరిగి అందరికీ తెలియజేసి దానిని  ప్రజలలో  శాశ్వతంగా ఉండేలా ఎన్నో ప్రయత్నాలు చేశారా మహాపురుషుడు  శంకర భగవత్పాదులు  అలాంటివారు రచించిన అనేక గ్రంథాలలో  వివేక చూడామణి  మణిపూస లాంటిది.
సమాజంలో ఉన్న దుష్టత్వాన్ని  రూపుమాపి  నీతిని నిజాయితీని నిలబెట్టడం కోసం జరిగిన యుద్ధంలో  మానవ ప్రకృతిలో ఉన్న అనేక రకాల  శంకలను తీర్చి  భారతీయులకు భగవద్గీత పేరుతో అందించిన  ప్రవక్త శంకరుల వారు  జీవితము అంటే (జీవి తనువుల కలయిక) ధృతరాష్ట్రునికి   కలిగిన  అనేక సంఘాలను తీర్చడానికి  సంజయుని ద్వారా  వినిపించిన అత్యున్నత గ్రంథం భగవద్గీత  మనసుకు బుద్ధికి జరిగిన సంభాషణ  అజ్ఞానాన్ని తొలగించడం కోసం విజ్ఞానం  ప్రబలడం కోసం  శంకరుల వారు చేసిన ప్రయత్నం  వేదముల ఉపనిషత్తుల సారం ఇందులో ఉంది  700 శ్లోకాలకు  7 వ్యాఖ్యలను రాసి  ప్రపంచ ప్రజలందరి చేత  కుల మతాలకు  అతీతంగా  అందరూ ఆమోదించిన గ్రంథం  భగవద్గీత  వెలుగును చూస్తే  మనసు వెన్నుపూసను  మన ముందు భౌతికంగా చూపించారు. ఆ రోజులలో శంకరాచార్యుల వారు  ప్రజల భాష సంస్కృతంలో ఉండడం వల్ల  వివేక చూడామణిని  సంస్కృత శ్లోకాలలో  రచించారు  కాలం గడిచిన కొద్దీ  సంస్కృత భాష కనుమరుగు కావడం  ఆంధ్ర భాషలో కూడా అనేక ప్రాంతీయ పద్ధతులు రావడం  ఒక ప్రాంతానికి సంబంధించిన వారి మాటలు మరొక ప్రాంతం వారికి అర్థం కాకపోవడం  జరుగుతోంది  వివేకాన్ని ప్రజలలో తీసుకురావడం కోసం  ఆ మహానుభావుడు చేసిన ప్రయత్నం  వివేక చూడామణి  అసలు ఆ చూడామణిలో ఉన్న విషయాలు ఏమిటి  సామాన్య ప్రజలకు అవి ఎలా ఉపయోగపడతాయి  కనుక దానిని జన భాషలో చెబితే  వారు అర్థం చేసుకొని దానిని ఆచరించడానికి అవకాశం ఉంటుంది  అన్న ఆశయంతో  కొన్ని ముఖ్యమైన విషయాలను ముచ్చటించడానికి మీ ముందుకు వచ్చాను  మీ అందరి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ  


కామెంట్‌లు