అక్కినేని శత జయంతి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.


 జీవితంలో అదృష్టం ఎవరి తలుపు ఏ క్షణాన తడుతుందో చెప్పడం కష్టం  తిరిగి అదే అదృష్టం ఏ క్షణాన అదృశ్యమవుతుందో ఎవ్వరు ఊహించలేరు  కష్టే ఫలి అని మన పెద్దలు చెప్తారు  తన కాళ్ళపై తాను నిలబడగలిగిన వ్యక్తి జీవితంలో సుఖాన్ని అనుభవిస్తాడు చిన్నతనం నుంచి అక్కినేని నాగేశ్వరరావు నాటకాలు వేయడం అనుకోకుండా సినీ ప్రవేశం చేయడం అప్పటికి సిహెచ్ నారాయణ రావు గారు నాగయ్య గారు పేరు తెచ్చుకున్నా వారిని దాటి ముందుకు ప్రయాణించిన వాడు అక్కినేని జీవితంలో మొదటిగా  అల్లూరి సీతారామరాజు తో ప్రారంభమై  జీవిత ధ్యేయం స్వాతంత్ర్య సమాపార్చన  దానికి ప్రాణం ఇచ్చి అయినా పాటుపడాలి  అన్న నీతిని తన సినీ జీవితంలో నిజాయితీగా అవలంబించారు. 93 సంవత్సరాల నిండు జీవితాన్ని అనుభవించిన వ్యక్తి చివరి సినిమా మనం లో కుటుంబం అంతా కలిసి ఉంటే ఎలా ఉంటుందో దానిలో ఉన్న సుఖాన్ని తెలియజేస్తూ నటించడం నటించడం సమాజానికి ఒక  సందేశాన్ని ఇవ్వడం  మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ భూమి మీదకు వచ్చిన ఎవరు జ్ఞాన సంపన్నులు కారు  తన ప్రయత్నంగా తాను చేసుకునే సాధన  నిరక్షరాస్యుడైన అక్కినేని అక్షరాస్యుడైన  రామారావు గారు వచ్చిన తరువాత స్వయం కృషితో  ఆంగ్లం తమిళం ఉర్దూ హిందీ భాషలలో నేర్చుకొని ఇతర దేశాలలో కూడా ఆంగ్లంలోనే ప్రసంగించే స్థాయికి ఎదగడం  వారి పట్టుదలకు నిదర్శనం.  వారు నటించిన ఏ చిత్రం  చూసిన సమాజానికి హితాన్ని తెలియజేసిందే తప్ప మరొక   దుర్నీతిని  బోధించలేదు.
తాను ధనికుడైనా  పిల్లలకు విలాస జీవితాన్ని  గడపమని చెప్పలేదు స్వయంకృషితో పైకి రావాలన్నారు  నాగార్జున కళాశాలలో చదివే రోజులలో కాలేజీ బస్సులోనే వెళ్లేవారు  స్కూటర్ కొనమంటే  నీవు సంపాదించి  కొంటే నాకు అభ్యంతరం లేదు అన్నారు  క్రమశిక్షణకు మారుపేరుగా పెరిగిన నాగేశ్వరరావు  ఇతరులను కూడా అలా ఉండమని ఆశించడంలో తప్పులేదు  అన్నపూర్ణ పేరుతో తాను నిర్మించిన సినిమాలు కానీ తాను నటించిన ఇతరుల సినిమాలలో కానీ అశ్లీలం అసభ్యత ద్వంద్వ అర్ధాలతో కూడిన పదాలను ఉచ్చరించడంమనం చూడం  దాన ధర్మాలలో తన చేయి పైనే ఉంటుంది తప్ప  ఎప్పుడు కిందకు రాలేదు అలాంటి  ఆదర్శ జీవితానికి శత దినోత్సవ కార్యక్రమాలు వారి పేరుతో జరుగుతూ ఉండటం గమనార్హం.

కామెంట్‌లు