కృష్ణ లీల;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 శ్రీకృష్ణుని తత్వాన్ని పూర్తిగా  అర్థం చేసుకొని  సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో రాసిన వాడు వ్యాస మహర్షి  భాగవతంలో శ్రీకృష్ణుని లీలలు ఇన్నీ అన్నీ కావు చంటితనంలో చేసిన ప్రతి పని  సమాజసంక్షేమానికి పనికొచ్చే పనే తప్ప  వారి గొప్పతనాన్ని చెప్పుకోవడానికి కాదు  ఎన్ని మారు వేషాలలో వచ్చి  తనను అంతం చేయడానికి ప్రయత్నం చేసిన  ఆ రాక్షస మూకను  మూకుమ్మడిగా సంహరించి  శాంతిని ప్రతిష్టించిన వాడు  శ్రీకృష్ణ పరమాత్మ  మానవుడు మానవుడిగా ఎలా ప్రవర్తించాలో చెప్పినవాడు రాముడు అయితే  తన లీలల ద్వారా మాయల ద్వారా  సమాజానికి ధర్మాన్ని  న్యాయాన్ని తెలియజేసిన వాడు  దానిని నిలబెట్టినవాడు   పరమాత్మ. తన చూపులతోనే  ఎదుటివారి ఆలోచనలను  తెలుసుకోగలిగిన  వారి మనసులను చదువ గలిగిన  మానసిక విశ్లేషకులు  శ్రీకృష్ణ  కౌరవసభలో తనపై హత్యా ప్రయత్నం జరిగినా  నిశ్చలంగా నిలబడినవాడు  రాచ మర్యాదలతో భోజనాలను ఏర్పాటు చేసినా  తన స్నేహాన్ని మరిచిపోకుండా  విదురిని ఇంటికి వెళ్లి  సాధారణ భోజనం చేసిన వ్యక్తి  ఆదర్శంగా జీవించటం  ఆయన జీవితంలో ఒక భాగం  సంగీతాన్ని ఆపోసన పట్టిన వాడు   గోవులను  గోపికలను  ఆనంద పరవశులను చేసి  తాను ఏది చెపితే అది చేయడానికి సిద్ధమయ్యేట్టుగా తయారు చేసుకున్న వాడు  మంచి సంగీతజ్ఞుడు  యుద్ధం చేయడం అన్నది  ధర్మం కోసం చేయాలి తప్ప  అక్రమాన్ని ప్రోత్సహించడానికి కాదు అని సలహా ఇచ్చినవాడు కృష్ణుడు.
ప్రజల రక్షణ కోసం సముద్రంలో  తన సామ్రాజ్యాన్ని నిర్మించిన, ఆర్కిటెక్, కరువు కాటకాలు లేకుండా ప్రజల క్షేమాన్ని సంక్షేమాన్ని పరిరక్షించినవాడు రాజుగా తన ధర్మాన్ని  నిర్వర్తించినవాడు  యాగాల వల్ల వర్షాన్ని తెప్పించి  వర్షం వచ్చేలా చేసి కరువు కాటకాలకు  ప్రజలను దూరంగా ఉంచిన    క్లైమేటలిస్ట్ జీవితకాలం ఆరోగ్యంతో  ఉండే ఏర్పాటు చేసిన మహారాజు  సుదర్శన చక్రాన్ని తన స్వాధీనం చేసుకుని  వైరి వీరుల పీచమణచినవాడు  తన వాడిని రక్షించడం కోసం  తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నవాడు  అలాంటి మానవత్వం కలిగిన వ్యక్తి కనుక  ఇన్ని సంవత్సరాలు గడిచినా వారిని గురించి మాట్లాడుకోవడం  వాడు చేసిన పనులను  కథలు కథలుగా చెప్పుకోవడం వారి వ్యక్తిత్వానికి నిదర్శనం.


కామెంట్‌లు