హోటళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మా చిన్నతనంలో  హోటల్ అన్న శబ్దం వినలేదు  ప్రతిరోజు మూడు పూటలా భోజనం చేయడం  సెలవు రోజుల్లో కానీ పండగలు వచ్చినప్పుడు గాని  ఇంట్లో  పదార్థాలు తినడం కోసం  చేసినవి చేయకుండా  ఒక్కో పండుగకు ఒక్కో పేరుతో ఒక్కొక్క  పదార్థాన్ని తినే వాళ్ళం సంక్రాంతి  వచ్చిందంటే అరిసెలు నెలరోజుల పాటు  చిరుతిండిగా ఉండేది  శ్రీరామ నవని వస్తే చాలు  పానకం  సిద్ధంగా ఉంటుంది  పేలాల పిండి ఒక పండగ  మరొక పదార్థం మరొక  పండుగకు  అమ్మ చేసి పెట్టడం  ఆ రోజుల్లో పనివారు రావడం వారి అందరికి అమ్మ పంచిపెట్టడం  వంట చేసినవి  సన్నిహితులకు పని వారికి పంపించడం  ఇవన్నీ చాలా ఆనందంగా ఉండే  పనులు  చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేమే అవన్నీ  చేసేవాళ్లం.
మేము ఉన్నత పాఠశాలకు వచ్చేసరికి  రాత్రుళ్లు గురువుగారింట్లోనే  నిద్రపోవడం  ఉదయం కాలువ గట్టుకు వెళ్లి కాల కృత్యాలు తీర్చుకొని  ఈత కొట్టి వచ్చేటప్పుడు  సుబ్బారావు మెస్  లో  ఇడ్లీ  పెసరట్టు మినపట్టు ఉప్మా  తప్ప మరి ఏది ఉండదు  వాటిలో ఏదో ఒకటి తినేయడం  ఆదివారం మాత్రం  పూరి చేసేవాడు. మేము  పెసరట్టు అని చెబితే  మా దగ్గర నుంచి కేక వేసేవాడు వెళ్లి తనే అట్టివేసి తీసుకొచ్చి మాకు  ఇచ్చేవాడు  నేను తిన్న తర్వాత ఆ ప్లేట్ లన్నీ తీసి శుభ్రం చేసుకునేవాడు  ఇంట్లో ఆడవాళ్లు ఇడ్లీ వేయడం  పిండి కలపడం చేసేవాడు  సుబ్బారావు మా అందరికీ ఎంతో ఆప్యాయంగా  పదార్థాలను అందించేవాడు  చట్నీ కావాలంటే రెండుసార్లు మూడుసార్లు అయినా విసుక్కోకుండా వడ్డించేవాడు  కాఫీ తయారు చేసే వాడిని మేము ఎవరు తీసుకునే వాళ్లం కాదు. కళాశాలకు వచ్చిన తర్వాత హోటల్ అన్న శబ్దం  ప్రాచుర్యంలోకి వచ్చింది  వీటిలో చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి  ఎక్కడి ధరలు అక్కడే  రామోజీరావు గారు హోటల్  ప్రారంభించినప్పుడు  మాకు హోటల్లో రెండు రూపాయలు దొరికే కాఫీ అక్కడ ₹10 ఉండేది  అంత ధర ఏమిటి అని ఒకసారి వెళ్లి ప్రయత్నం చేస్తే  ఒకరు వచ్చి ఆర్డర్ తీసుకోవడం  మరొకడు వచ్చి మంచినీళ్లు పెట్టడం  మరొకటి వచ్చి  కాఫీ తీసుకోవడం  బిల్లు మరొకరు వెళ్దాం అంటే ఎక్కువ  ధర ఉండడంతో చాలా తక్కువ మంది వచ్చేవారు  ఎంతమందిని పోషించవలసిన బాధ్యత  యజమానికి ఉండడం వల్ల  ధరలు పెంచడం జరుగుతుంది  ఏసీ తప్పనిసరిగా ఉంటుంది  ఫ్యాన్ లేకుండా ఉండదు. వీటన్నిటి ఖర్చు ఎంతమంది స్టాంప్ ని  భరించాలి  ఆకర్షణ అంతా మీరే కదా పెట్టుకునేది  దానికి తగినట్లుగా లాభాలు కూడా ఉండాలి  అలా కొత్త పుంతలు తొక్కినది  ఈ హోటల్  ఇవాళ రకరకాల పద్ధతులతో  విపరీతంగా ఖర్చులు పెంచే స్థితి  మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.



కామెంట్‌లు