మన గొప్ప;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇవాళ సమాజంలో పర భాషా సంస్కృతి బాగా పెరిగిపోయింది  మెకాలే వేసిన  బీజం పెద్ద  ఊడలు దిగిన చెట్టుగా మారింది  మన సనాతన ధర్మం  ఏమిటో మనకు తెలియకుండా  పాశ్చాత్య సంస్కృతి తప్ప  మరొకటి లేదు అన్న అభిప్రాయానికి వచ్చింది యువత  ఆంగ్ల  చదువులు పెరిగిన తరువాత ప్రతిదీ  ఇతర దేశస్తులు చెప్పిన విషయాలు తప్ప మనకు ఏమి తెలియదు  అన్న నిర్ణయానికి మనవాళ్లు రావడం  నిజంగా సోచనీయం  ఇవాళ ఒక జర్మనీ పండితుడు ఏదో ఒక చిన్నమాట చెప్పాడు  ఏ జబ్బు రావడానికి అయినా కారణం మనసు ముఖ్యం అని  జీవన విధానం మార్చుకుంటే  జబ్బులు రాకుండా ఉంటాయి అన్న విషయం  అంత గొప్పగా ఇంతవరకు ఎవరు చెప్పలేదని యువత నమ్ముతోంది  అతను చెప్పిన దానినే అనుసరించమంటుంది. ఇది ఎంత నవ్వులాటగా ఉంటుందో మన పెద్దల విషయంలో
గ్రీకు పండితులు చెప్పిన విషయాలు తప్ప మిగిలిన ఎవరూ గొప్ప విషయాలు చెప్పలేదు అన్నఅభిప్రాయం యువతలో పాతుకు పోయింది  అంకెల విషయం తీసుకున్నట్లయితే  ఒకటి నుంచి తొమ్మిది వరకు మాత్రమే వారు చెప్పగలిగారు  ఆ తర్వాత ఏమిటో వారికి అర్థం కాలేదు  దానిని అర్థం చేసుకుని  ప్రపంచానికి వరంగా  సున్నను ఇచ్చిన వారు ఎవరు  భారతీయులా పాశ్చాత్యులా  ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తోంది  భారతీయుడైన ఆర్యభట్టు  అన్న శాస్త్రజ్ఞుడు ఈ విషయాన్ని కనిపెట్టాడన్న  ఆలోచన మనకు రాదు  దానివల్ల ప్రపంచంలో కొన్ని మిలియన్ల  వ్యక్తులకు లాభం జరిగింది  అంతకు పూర్వం  మన పెద్దలు చెప్పిన మరొక శ్లోకం ఇదంపూర్ణం అదంపూర్ణం  సున్న నుంచి సున్నను హెచ్చించినా, భాగించినా తీసివేసినా, కూడినా వచ్చేది సున్నాయే  అన్న విషయం లెక్కల్లోనే కాదు ఆధ్యాత్మిక విషయంలో కూడా  ప్రతివాడు అనుసరించి చేరవలసిన విషయం అని ప్రతి ఒక్కరు గుర్తించారు. ఏ చిన్న జబ్బు చేసిన ఆసుపత్రి చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా  చరకుడు అన్న మహా  యోగి చరక సంహిత అన్న గ్రంథాన్ని మనకు అందించి  మన ఎదురుగా ఉన్న చెట్టు చేమ చిన్న చిన్న దుంపలు  ఆరోగ్యానికి ఎంతగా ఉపయోగపడతాయో  చదివిన వారికి అర్థమవుతుంది  అతి చిన్న విషయానికి గాబరా పడకుండా  ప్రశాంతంగా ఆలోచించినట్లయితే దాని మూలం ఏదో తెలుస్తుంది  ఆ మూలానికి మందు ఇవ్వాలి తప్ప  మిగిలిన ఆలోచనలను దూరంగా పెట్టాలి  ఇవాళ  ఆంగ్ల వైద్యం  క్షణికం  ఆయుర్వేదం పరిపూర్ణం  అని తెలుసుకున్నట్లయితే  మండల దీక్ష (40 రోజులు  మందు వాడడం) తెలిస్తే భారతీయుడు ఎంత విజ్ఞానంతో ముందుకు వెళుతున్నారు  ఇంతకు ముందే  మనకు తెలియజేసిన వ్యక్తుల వల్ల తెలుస్తోంది  ప్రతిదానికి  ఎవరో చెప్పింది మనం ఆచరిస్తున్నామనే మూఢ నమ్మకాన్ని ముందు వదులుకోవాలి.


కామెంట్‌లు