పండితుని గౌరవం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 పెద్దలు చెప్పిన ప్రతి వాక్యం శిరోధార్యమే  అనవసరమైన విషయాలను వారు ఎప్పుడు ప్రస్తావించరు  మన పురోగతిని కాంక్షించి  దానికి తగిన సలహాలు ఇవ్వడం  వారి సహజ లక్షణం  ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని  అందరూ తనను గురించే మాట్లాడుకుంటూ ఉండాలని  తనకు అనేకమంది అనుయాయులు ఉండాలని  కోరుకుంటూ ఉంటాడు  ఏ గౌరవ మర్యాదలు కూడా అమ్ముడు పోయే వస్తువులు కాదు  మరియు గౌరవం ఎలా పెరుగుతుంది అంటే  ముందు పెద్దలపట్ల వినయ విధేయతలతో ఉండడం నేర్చుకోవాలి  తాను చేసే ప్రతి పని అర్థవంతంగా ఉండాలి నలుగురికి సహాయపడేట్టుగా ఉండాలి తన ప్రతి పని  వయసుతో సంబంధాలు లేకుండా ప్రతి వారిని గౌరవించాలి  ఇది ప్రతి వ్యక్తి లక్షణం. ఏ కుటుంబంలోనైనా ఆ కుటుంబ పెద్ద  ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలను పొందుతూనే ఉంటాడు  ఆ ఇంటిలో తన మాట సాగుతూనే ఉంటుంది  మంచి చెడు ఏది జరిగినా దానికి బాధ్యత తాను వహిస్తూ  అందరిని ఒక త్రాటి మీద నడుపుతూ ఉంటాడు  కనుక ఆ ఇంటిలో అతనికి గౌరవ మర్యాదలు ఉంటాయి  అలాగే గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి  ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని  కూలంకషంగా అధ్యయనం చేసి  దానికి పరిష్కార మార్గాలను ఆలోచించి  ఆ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇతి బాధలు లేకుండా చేయడం అతని బాధ్యతగా  చేస్తూ ఉండడం వల్ల అతనికి ఆ గ్రామంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి  అందరూ తలవంచి ఆయనకు నమస్కరిస్తారు. అలాగే ఒక మహారాజు తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ తనకు అనుయాయులుగా ఉండడానికి ప్రయత్నించేస్తారు  ప్రజలకు కావాల్సిన ప్రతి  పనిని వారు చేయిస్తారు.  దేశ ప్రజల క్షేమాన్ని సంక్షేమాన్ని కోరేవాడు కనక అతనికి  గౌరవ మర్యాదలు ఉంటాయి  శిక్షిస్తాడు అన్న భయంతో కూడా కావచ్చు  కానీ పాండిత్యంలో ఒక వ్యక్తి  తన కుటుంబంలో కానీ తన గ్రామంలో కానీ  తన రాజ్యంలోనే కాకుండా ఇతర రాజ్యాలలో కూడా  తన పాండిచే ప్రక్రియ వల్ల  గౌరవ మర్యాదలను పొందగలుగుతున్నాడు  ప్రతి అక్షరాన్ని అర్థవంతంగా చెప్పగలిగిన  వారి మేధా సంపత్తికి  ప్రతి ఒక్కరూ తలవంచి నమస్కరించి తీరవలసినదే. కనుక వీరిలో ఎవరు గొప్ప అధికారాన్ని చెలా ఇస్తున్న వాడి గౌరవ మర్యాదలు బలవంతంగా వచ్చేవి  పండితునికి ఆత్మీయంగా  మనస్ఫూర్తిగా వస్తాయి.అది తెలిస్తే మనం ఎలా ప్రవర్తించాలో మనకు అర్థం అవుతుంది.


కామెంట్‌లు