డా. ముత్తులక్ష్మీ రెడ్డి;- డా.నీలం స్వాతి,చిన్నచెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 శాస్త్రాలు చెప్పాయని దేవుడితో కళ్యాణం జరిపించి వాళ్ళని వేశ్యలుగా మార్చి వాడుకొని  40 సంవత్సరాల తర్వాత వేలం వేసే నీచ  నికృష్ట ఆచారము  వందల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం పేరుతో ఆచరించారు  ఒక తంజావూర్ టెంపుల్ లోనే  రాజా సూరుని కాలంలో 400 మంది పైగా దేవదాసీలు ఉండేవారు అని  చరిత్ర మనకు తెలియజేస్తుంది  దేవదాసి తల్లికి జన్మించిన డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి డాక్టర్ సుందర రామిరెడ్డి గారి భార్య  పెరియారు ఉద్యమ ఫలితంగా అనేక ప్రతికూల పరిస్థితులను ఎదిరించి చదువుకొని డాక్టర్  అయ్యింది  ప్రపంచ ప్రఖ్యాత అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ కూడా డాక్టర్ ముత్తు లక్ష్మి రెడ్డి గారే అన్న విషయం  అందరికీ తెలిసినదే. ముత్తు లక్ష్మీరెడ్డి అనేక  ప్రథమ  బహుమతులను పొంది  మహిళా ప్రపంచానికి పేరు ప్రతిష్టలుతీసుకువచ్చిన మహిళ  బ్రిటిష్ ఇండియాలో  స్త్రీలు రాజకీయాలలోకి రావడానికి ఎంతో భయపడేవారు  ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహం లేకుండా పోయేది  అలాంటి రోజులలో ధైర్యం చేసి ముందుకు వచ్చి  తొలి మహిళ ఎమ్మెల్యేగా  ఎన్నికైన వారు ముత్తు లక్ష్మీ రెడ్డి గారు  అప్పట్లో స్త్రీలకు  మెడికల్ కాలేజీలో చదివే అవకాశాలు లేవు  దానికోసం ఆమె ఆమె తండ్రి పోరాడి  మగవారు చదువుతున్న కళాశాలలోనే చేరి  ఎంబిబిఎస్ చదివి  అక్కడ ఉన్న అందరి మగవాళ్ళను  దాటి అద్భుతమైన ప్రతిభతో ప్రథమ శ్రేణిలో  ఎన్నికైన డాక్టర్ ముత్తు లక్ష్మిరెడ్డి గారు. 1912 ప్రాంతంలో  స్త్రీలు ఎవరు కూడా హౌస్ సర్జన్ గా లేరు  భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ హౌస్ సర్జన్ గా స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తోటి చైర్ పర్సన్ గా  ఆమె రావడం  మహిళా లోకానికి  పేరు తెచ్చిన మహిళగా పేరుపొందింది లెజిస్లేటివ్  కౌన్సిల్ తొలి మహిళ డిప్యూటీ ప్రెసిడెంట్ గా కూడా  ఎన్నిక కాబడి అందరినీ ఆశ్చర్యంలోముంచి వేసింది  1886లో తమిళనాడులోని దేవదాసి కుటుంబంలో పుట్టి  ఆ వ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా తెలుసుకొని  చివరకు ముత్తు లక్ష్మి ఆ వ్యవస్థ రద్దులో కీలక పాత్ర పోషించి  విజయాన్ని సాధించింది  1956 లో పద్మభూషణ్ బిరుదు ప్రభుత్వం నుంచి పొందిన  మొదటి మహిళ  ముత్తు లక్ష్మీరెడ్డి  ఆమె జయంతి సందర్భంగా  ఆవిడ గురించి తెలుసుకోవడం  ఎంతో ఆనందం.


కామెంట్‌లు