నిలువెత్తు జ్ఞానం గురువు;- మొర్రి గోపికవిటి.శ్రీకాకుళం జిల్లా 8897882202
జగతికి వెలుగు గురువు
విజ్ఞానపు తరువు గురువు
విలువల పయనం గురువు
శిష్యుల దైవం గురువు

మట్టి ముద్ద కు ప్రాణం పోసే గురువు
బండరాయిని శిల్పం చేసే గురువు
బ్రతుకు నావకు చుక్కావి గురువు
 స్ఫూర్తి రగిలించు గురువు

ఆత్మవిశ్వాసానికి ప్రతీక గురువు
మానవ వనరులను అందించు గురువు
సమస్యా పరిష్కార నైపుణ్యం గురువు
అవని నుండి అంతరిక్ష పయనం గురువు

పరబ్రహ్మ స్వరూపమే గురువు
శిష్యుల మదిలో కొలువై గురువు
నిరంతర ప్రవాహం గురువు
నిలువెత్తు జ్ఞానం గురువు
*****


కామెంట్‌లు