ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐల-కరీంనగర్-9247593432
గజేంద్ర మోక్షం (90 నుండి 94)
---------------------------------------
అన్నీ ఉంటెనె రాజు
ఏది తగ్గినను బూజు
అల్పముగా జూసుటకు
ఎంపికయెను గజరాజు

అందమైన రోజులలో
మునిగిపోయె ఆటలలో
పొగడ్తలు మిన్నంటగ
పొంగిపోయె ఆ నదిలో

నది చుట్టు పూల వనము
నదిలో కమలపు వనము
పూలు పెట్టి గజరాజును
పొగిడిరి ఆనాటి దినము

ఈశ్వరుడికి మిన్న యని
ఇంద్రుడి వలె నుంటివని
పూల అలంకరణ తోడ
మరియు చున్న కొండ వని

రకరకాల పూలు బెట్టి
పొగడ్తలో ముంచినట్టి
మకరము కాలిని పట్టగ
పోయిరి తననిడచి పెట్టి


కామెంట్‌లు