ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐలకరీంనగర్9247593432
గజేంద్ర మోక్షం (151 నుండి 158)
-------------------------------------------
తరలుచుండె లక్ష్మీ పతి
ఎవరికి చెప్పక దళపతి
గజేంద్రుడి మొర వినగనె
తనను తాను మరచిన స్థితి

ఆయుధాలు చేపట్టడు
గరుడ వాహనంబెక్కడు
వాయువేగమున హరి
ఎచటికొ ఏమో చెప్పడు

ఆందోలననో తెలియదు
ఆవేషంబో తెలియదు
సరసరమని పోవుచుండె
సంబరమా! మరి తెలియదు

అమ్మకేమొ చెప్ప కుండె
పైట కొంగు చేతనుండె
తన వెంట వచ్చు లక్ష్మిని
కొంచమైన గానకుండె

అమ్మ తిప్పలెవరికెరుక
భక్తుల భజనలే గనుక
దేవగణము చూస్తుండగ
శ్రీ లక్ష్మి కొంగు విడువక

దిక్కు దశలు చూడడు
నలు దిక్కులు గాంచడు
చేతిన శ్రీ లక్ష్మి కొంగు
ఉందని గ్రహియించడు

విశ్వ వ్యాప్తమై కదిలెను
మరచి పోయె తనను తాను
కొంగును బిగబట్టుకొని
శ్రీ లక్ష్మీ కూడ కదిలెను

కొంగు మెలిక పడుచుండగ
తిరిగెను లక్ష్మి వడివడిగ
ఎంత పిలిచినను ఆగడు
మాత వెంట వస్తుండగ


కామెంట్‌లు