ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐలకరీంనగర్9247593432
గజేంద్ర మోక్షం (171 నుండి 180)
=========================
తొందర తోడ శ్రీహరి
వెళ్లేడిదె  రహదారి
కరమున శ్రీలక్ష్మి పైట
విడువ కుండ కదిలె మరి

తండ్రి ముందు తరలు చుండ
అమ్మ వెంట వెడలు చుండ
గరుడ వాహనము కూడ
వెంటనె పరుగెత్తు చుండ

గదా శంకు చక్రాలు
పరమాత్మునాయుధాలు
అన్ని కలిసి వెను వెంటనె
తరలుటెంత చిత్రాలు

దేవతలావింత జూసి
కదులుచుండి రంతగలిసి
ముక్కోటి దేవతల
మును ముందున మురళి తులసి

చేరిరి కరి అడ్డకు
చూసిరి నది ఒడ్డుకు
విశ్వాధి పతిని గాంచి
చింత దీరెన్ తుదకు

ఓపికతో నొక కమలము
తొండముతో తెంపి గజము
స్వామి పాద పద్మాలకు
చేర్చెను మరి కొస ప్రాణము

పట్టెను శ్రీహరి చక్రము
విడిచెను ఆజల భాగము
నీటిని ఛేదించి తరలె
రివు రివ్వున ఆ చక్రము

సూటిగ మకరము శిరము
తెంచగానే చక్రము
రివ్వుమనుచు గంధర్వుడు
పెట్టెను లేచి దండము 

వెంటనె ఆ చక్రధారి
కరికి మోక్ష మిచ్చెను మరి
శాప గ్రస్త విమోచనము
మకరికి దక్కెను తదుపరి

ముసలికి వచ్చిన ఫలితము
గజముకు దక్కిన మోక్షము
సహస్రేళ్ళ యుద్ధ భేరి
ముగిసి పోయినాక్షణము

దర్శన మీయగ వచ్చెను
మోక్షంబు ప్రసాదించెను
భక్తల కోరిక మేరకు
భగవంతున్ని నేననెను

దైవ మెల్ల పూల నాన
కురిపించిరి ఆ క్షణమున
ఆనందపు వెల్లువ
జగతికి చక్కని సూచన


కామెంట్‌లు
అల్ప పదముల తో
అనంత త త్వం తెలిపిరి
ఇది గదా
మురారి
గాధాలహరి
అల్ప పదాలతో
అనల్ప భావాన్ని
అందించిన
మీ భావ వాహిని కీ
ధన్య వాదాలు