ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐల-కరీంనగర్-9247593432
గజేంద్ర మోక్షం (95 నుండి 100)
=====================
మానవ జీవన గతిని
తెలుపు చున్న గజేంద్రుని
మోక్షంబును గుర్తెరిగి
తెలుసుకొమ్ము చదువుకొని

పొగడ్తలకు మునిగిపోవు
దుఃఖములో జిక్కిపోవు
పృథ్విన బంధువులెవరను
జ్ఞానమంత తెలిసి పోవు

కీర్తి ఉంటె బంధువులు
లేకుంటే శత్రువులు
ప్రతిష్టకే ముప్పు గలుగ
తప్పించుకునె వారలు

కష్టంలో ఎవ్వరు
కాపాడేదెవ్వరు
ఎవరు లేరు అన్నప్పుడు
దైవంబును పిలుతురు

మానవులకు గుర్తు రాని
భగవానుడొక్క గజముని
కాపాడగ వచ్చెనట
పరుగెత్తుచు పిలిచాడని

ఎందుకు మరి పరుగులు
మరచెన తన లీలలు
ఉన్న చోటు మరిపించ
ఎంత గొప్ప పిలుపులు


కామెంట్‌లు