ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐల-కరీంనగర్-9247593432
గజేంద్ర మోక్షం (121 నుండి 130)
-------------------------------------------
రజో గుణము లోపించగ
కరి లోచన మొదలవ్వగ
నిశ్చయంబుకచ్చెను ఇక
పరమాత్మయె దిక్కుకాగ

అంతటి పరివారమున్న
బంధు బలగమెంత ఉన్న
చూస్తుండెడి వారలెగని
సాయమెట్లు చేదురన్న

ఇంద్ర వాహనము సైతం
దేవ దేవతలు సైతం
ఏండ్లకేడ్లు జరుగుతున్న
పోరు చూడ విధి విదితం

జంతువైన మనిషైన
ఒకటేకద కాలమున
ఐసీలో పెట్టి నపుడు
ఎవరుండేరు ప్రక్కన

కాలముతో రణరంగము
మృత్యువుతో పోరాటము
ఐసీ అద్దము నుండే
ఆత్మీయులు జూడ నిజము

బంధుమిత్రులెంట రారు
బలగమేమి జేయలేరు
ఎవరి పోరు వారిదని
యోచించె కరి యీతీరు

ఎంతటి గొప్ప వాడిని
ఎందరి ప్రాణ నాథుని
తను ఉదకంబిడువ నీరు
సాగె నాడునదులని

ఆ గాంభీర్యంబును విడి
ఈ నదికేగితినే చెడి
వచ్చి నంత పని ముగించి
పోక జిక్కుబడ గారడి

అంతా పది యోజనములు
జాగృత్ స్వప్న సుశిక్షితులు
త్రిపున సుందరి యనుచు
పోల్చ బడునట్టి రీతులు

భూత భవిష వర్తమాన
అన్నీ సమములు గావున
తిరుగు జీవ చక్రమిది
ఇట్టి కూట కాయంబున


కామెంట్‌లు