హరివిల్లు రచనలు,- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864
హరివిల్లు 221
🦚🦚🦚🦚
నాటి మహా నటుల
నటన, నేటికీ పదిలం...!
ఈ నాటి నటుల నటన
జిమ్మిక్కులతో గాలం.....!!

🦚🦚🦚🦚
హరివిల్లు 222
🦚🦚🦚🦚 
మరి మరి చదువ మది చేరి
చదవులమ్మగ స్థిరమై...........!
సుకవితలు పలికించవె
హరిచందన పరిమళమై‌‌.........!!
 
🦚🦚🦚🦚
హరివిల్లు 223
🦚🦚🦚🦚
యోగ నిద్రను విడిచెను
ఉత్థాన ఏకాదశి............!
అత్తవారిల్లు చేరెను
క్షీరాబ్ది ద్వాదశి...............!!

🦚🦚🦚🦚
హరివిల్లు 224
🦚🦚🦚🦚 
ముగ్గులున్న వాకిళ్లు
కళ్ళను ఆకర్షించును....!
సంప్రదాయం తెలుపుచు
కళలను సదా పెంచును....!!

🦚🦚🦚🦚
హరివిల్లు 225
🦚🦚🦚🦚 
రాలుతున్న చినుకులు
తాకుతున్న కిరణాలు......!
పరావర్తనపు వెలుగులు
అలరించు సప్తరంగులు.....!!

                (ఇంకా ఉన్నాయి)


కామెంట్‌లు