హరివిల్లు రచనలు,కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864.
 హరివిల్లు 231
🦚🦚🦚🦚
మేను పులకరించు ముక్తి
మార్గముల రచనలు మేలు..!
పోతన భాగవత భక్తి
పద్యములు చదివిన చాలు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 232
🦚🦚🦚🦚 
ఉచిత చోటు, కొమ్మల
నమ్మికలు అశాశ్వతం..!
స్వశక్తి రెక్కలే కదా 
పక్షులకు శాశ్వతం.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 233
🦚🦚🦚🦚
వాసుదేవ నామ దేవ
పిలుపులతో పద భేదము...!
అద్వైత సిద్ధాంతమున
హరి హరులకు అభేదము‌...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 234
🦚🦚🦚🦚 
ఒకేలా ఉండే రెండు
కళ్ళు కుడి ఎడమలు...!
ఒకింత పరికించి చూడు
తేడాలు విదితములు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 235
🦚🦚🦚🦚 
కుంభ రాశిలో గురువు
సింధూనదికి పుష్కరం...!
పుష్కర నదీ స్నానం
చేయుట మన ఆచారం...!!
                (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు