హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
హరివిల్లు 236
🦚🦚🦚🦚!
విమర్శలు వెనువెంటనే
ఆలోచింప చేస్తాయి......!
కాస్త విరామమిచ్చినచో
లోతులవగతమౌతాయి....!!

🦚🦚🦚🦚
హరివిల్లు 237
🦚🦚🦚🦚 
దీపాల వెలుతురులకు
అయోమయం తొలగుతుంది.!
పగ అసూయలు విడుచుటకు
ధర్మ దారి పిలుస్తుంది............!!

🦚🦚🦚🦚
హరివిల్లు 238
🦚🦚🦚🦚
మంచితనం కూడా 
తెలివి లాంటిదే.......!
తెలివికి మంచి తోడైతే
విజయకేతనం మనదే...!!

🦚🦚🦚🦚
హరివిల్లు 239
🦚🦚🦚🦚 
మువ్వల సవ్వడులు
ఆవలకు వినిపించె....!
వడివడి నడకలు
వలపులై మురిపించె....!!

🦚🦚🦚🦚
హరివిల్లు 240
🦚🦚🦚🦚 
అక్షరాల పొందికలో
దొర్లవలదు దోషాలు...!
నేర్చుకో ప్రయోగాలు
ఉండాలి మెలకువలు

....!!

                (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు