హరివిల్లు రచనలు,; కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్, 9440522864.
 హరివిల్లు 246
🦚🦚🦚🦚
అమార్గములు పట్టెదరు
అరాచక దుర్మార్గులు.........!
హితమార్గము వెళ్ళెదరు
సహేతుక సన్మార్గులు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 247
🦚🦚🦚🦚 
అమోఘ మార్గశిరము
గీతా సందేశము...........!
గురుదత్త మార్గము
ఆధ్యాత్మిక జీవనము.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 248
🦚🦚🦚🦚
లోభ గుణం ఉన్న చోట
అత్యాశకు చావు లేదు....!
త్యాగ గుణం ఉన్న చోట
అత్యాశకు తావు లేదు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 249
🦚🦚🦚🦚 
అతి చనువును గైకొని
పరిహాసమాడవలదు....!
అతి చులకనగ భావించి
తృణీకరించవలదు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 250
🦚🦚🦚🦚 
దగ్గరితనం దూరాన్ని
పెంచకుండ చూడాలి...!
దూరముగాయున్నను
భావ పటిష్టతుండాలి.....!!
                (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు