హరివిల్లు రచనలు,;-కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,; -9440522864.
 హరివిల్లు 271
🦚🦚🦚🦚
డేగ వేగమును పెంచితె
కోడి పిల్ల దొరుకుతుంది...!
కంటి చూపు చక్కగుంటె
దూరముతో పనేముంది...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 272
🦚🦚🦚🦚 
వికారమున్నను స్వేచ్ఛ
ఉంటే భయముండదు...!
అందమున్నను ఆంక్షల
వల ఆనందమునివ్వదు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 273
🦚🦚🦚🦚
పిరికి వాళ్ళ వెట్టి 
చాకిరితొ శ్రమ దోపిడి...!
అదియును సరిపోక 
అదనపు మేధో దోపిడి...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 274
🦚🦚🦚🦚 
చిన్న వారికంద కుండ
పిల్లి వచ్చి త్రాగ కుండ....!
దొర్లి క్రింద పడకుండ
ఉట్టి పైన పాల కుండ.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 275
🦚🦚🦚🦚 
హితకారక పనుల విలువ 
యువతకు తెలియజేయుము.!
జగతి ప్రగతి కాంక్షించి 
జతగా కలిసి నడువుము.....!!
                (ఇంకా ఉన్నాయి)
కామెంట్‌లు