హరివిల్లు రచనలు ; కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864.
 హరివిల్లు 276
🦚🦚🦚🦚
ఉత్తర ద్వార దిశగా
గుడిలోని కి ప్రవేశం...!
భవ బంధ విముక్తికై
పరచింతనకవకాశం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 277
🦚🦚🦚🦚 
ఆవు పిడకల కుప్పలు
భోగి మంటల వెలుగులు...!
ఆవరించి సమకూర్చును
మంచి మహిమల ఔషధులు‌‌.‌.!!
🦚🦚🦚🦚
హరివిల్లు 278
🦚🦚🦚🦚
బాధ్యతాయుత స్వేచ్ఛ
బాధ్యతలను మరువదు....!
బాధ్యతారహిత స్వేచ్ఛ
కలలోను కోర కూడదు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 279
🦚🦚🦚🦚 
జీవితము ప్రతి క్షణము
ఇహమున నూతనత్వమే...!
ఊహకందని విధముగా
మారుటయు అనివార్యమే...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 280
🦚🦚🦚🦚 
కని పెంచే తల్లులకు
తెలుసు మాతృత్వం.....!
తోబుట్టువులు చూపాలి
తమ సౌభ్రాతృత్వం.......!!
                (ఇంకా ఉన్నాయి)


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం