హరివిల్లు రచనలు,;- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,- 9440522864.
 హరివిల్లు 181
🦚🦚🦚🦚
సమయ పాలనలు మరిచిన
అర్థ రహిత జనులేల ‌...........!
నియమ పాలనలు మరిచిన 
అస్తవ్యస్త మనిషేల...............!!
🦚🦚🦚🦚
హరివిల్లు 182
🦚🦚🦚🦚 
నిర్దేశిత వేగమున్న
గడియారమొక పరికరం....!
పెద్దల ననుసరించిన
జీవిత మారోగ్యకరం..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 183
🦚🦚🦚🦚
తపోధనుల మనోబలం
మహిళామణుల సహనం...!
మనం పాటించి చూపిన
తెలియును మన సంయమనం...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 184
🦚🦚🦚🦚 
గాలివాటపు పరుగులిడు
చిన్న అలలనుకోవలదు.....!
అలలు చేరి ఒక్కటైన
పెద్ద సునామీ వదలదు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 185
🦚🦚🦚🦚 
అంతర్లీన భావాలు
లోన మౌనాక్షరాలు.....!
అభివ్యక్తీకరణల
వలన స్వరాక్షరాలు......!!
                       (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు